ఓ నటిని రేప్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి అరెస్ట్ అయ్యారు. తమిళనాట సినీ , రాజకీయా వర్గాలను షేక్ చేసిన ఈ కేసులో ఈ అనుకోని ట్విస్ట్ ఎదురైంది.
కోలీవుడ్ నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్ ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు.
కోలీవుడ్ నటి, మలేషియా పౌరసత్వం ఉన్న చాందిని చేసిన అత్యాచార ఆరోపణలతో మణికందన్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని నటి చాందిని మాజీ మంత్రి మణికందన్ పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత మణికందన్ పరారీలో ఉన్నాడు. తాజాగా అరెస్ట్ చేశామని తెలిపారు.
మణికందన్ ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడని నటి ఇటీవల ఆరోపించింది.. తాను గర్భం దాల్చగా దానిని తొలగించమని బలవంతం చేశాడని ఆరోపించింది.అలా మూడుసార్లు గర్భాన్ని తీయించుకున్నానని మీడియాకు వివరించింది. తాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.