ఆయన మాట దూకుడు. రాజకీయం కూడా అలాగే ఉంటుంది. ఒక విధంగా ఆయన ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. మొత్తం రాజకీయ జీవితం అంతా ఆయన అలాగే సాగారు, ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వయసు పెరిగినా ఆయనలో ఆ జోరు మాత్రం అలాగే ఉంది. ఆయనే విశాఖ జిల్లా నర్శీపట్నానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన తెల్లారిలేస్తే ఏకంగా జగన్ మీదనే కామెంట్స్ చేస్తున్నారు.
జగన్ కి తుగ్లక్ సీఎం అని పేరు పెట్టి మరీ హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఆ మధ్యన ఆయన గుంటూరు సభలో జగన్ మీద చేసిన కామెంట్స్ ఏపీలో రచ్చ రచ్చ చేశాయి. ఈ మధ్య ఆయన మరోసారి జగన్ విషయంలో అనుచితమైన కామెంట్స్ చేయడంతో ధీటుగా వైసీపీ నేతలు కూడా బదిలిచ్చారు. ఇపుడు అటూ ఇటూ పొలిటికల్ గా హీట్ గానే ఉంది సీన్.
ఈ టైమ్ లో అయ్యన్నపాత్రుడు నర్శీపట్నంలో లాటరైట్ గనులను అక్రమంగా తవ్వేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పెద్దల మద్దతుతోనే ఇదంతా సాగుతోంది అని కూడా ఆయన ఆరోపించారు. ఇలా ప్రకృతి సంపదను పూర్తిగా దోపిడీ చేస్తున్నారని ఘాటుగానే విమర్శలు చేశారు, దీనికి రిప్లై ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ లాటరైట్ గనుల తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందే టీడీపీ హయాంలో, నాడు అయ్యన్నే పెద్ద ఎత్తున లాటరైట్ గనులను తన అనుచరుల ద్వారా దోచుకున్నారని ఆరోపణలు చేశారు.
దీంతో మండిపోయిన మాజీ మంత్రి అలా ఊరకే ఎందుకు ఆరోపణలు చేస్తారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. నేను తప్పు చేశాను అని తేలితే నన్ను తీసుకెళ్ళి లోపలేయండి. లేకపోతే గమ్మున ఉండండి అంటూ గట్టిగానే రిటార్ట్ ఇచ్చేశారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోరూ, నేను కానీ ఎవరు కానీ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాలి కదా. ఊరికే అవతల వారి మీద గాలి విమర్శలు చేయడం కాదంటూ ఫైర్ అయ్యారు.
మొత్తానికి తాను దేనికైనా రెడీ అంటున్నారు మాజీ మంత్రి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఉన్న విషయమే చెబుతున్నాను అంటున్నారు. ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ అక్రమంగా తరలిపోతున్న లాటరైట్ ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సరైన సవాల్ అయ్యన్న చేశారని ఆయన అనుచరులు అంటున్నారు.
ఇక్కడ చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు దగ్గర కావస్తోంది. అదే సమయంలో ఎపుడో అయ్యన్న టైమ్ లో లాటరైట్ గనులలో అవినీతి జరిగింది అని చెబుతున్న వైసీపీ పెద్దలు నిజంగా ఎందుకు చర్యలు తీసుకోరు అన్నదే ఇక్కడ జనాల్లోనూ కలుగుతున్న డౌట్. మొత్తానికి నన్ను లోపలేయండి అంటూ డేరింగ్ గా అయ్యన్న చేసిన సవాల్ కి వైసీపీ నుంచి జవాబు ఏం వస్తుందో చూడాల్సిందే.