డీఎల్ మార్క్ బ్లాస్టింగ్ : వివేకాను చంపిందెవరో జగన్ కి తెలుసు ?

Update: 2023-01-07 16:30 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది ఎవరో జగన్ కి తెలుసు అంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా జగన్ ఆ విషయాల గురించి చెబితే మంచిదని ఆయన అంటున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అసలైన నిందితులు తొందరలోనే బయటకు వస్తారని ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

కేవలం వారం రోజుల వ్యవధిలో సీబీఐ వివేకా హత్య కేసులో నిందితుల వివరాలను బయట పెట్టడం ఖాయమని ఆయన అంటున్నారు. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి చివరి వరకూ ఏమి జరిగింది అన్నది ఎర్రి గంగిరెడ్డికి పూర్తిగా తెలుసు అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక కుట్ర ప్రకారం వైఎస్ వివేకా పక్కనే ఉంటూ ఆయన ఓడించేశారని డీఎల్ సంచలన కామెంట్స్ చేశారు.

ఆ ఎన్నికల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ మనిషిగా ఉంటూ వివేకా వెంట ఉన్న దేవిరెడ్డి చివరికి ఆయన్ని ఓడించేశారని డీఎల్ ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ పూర్తి నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా తాము చేసిన దర్యాప్తునకు సంబంధించి వివేక హత్య కేసు విషయంలో పూర్తి వివరాలను కోర్టుకు సీబీఐ సమర్పించినట్లుగా చెబుతున్నారు.

అలాగే ఈ కేసుని సీబీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ కేసు విచారణ దశలో స్థానికులు కొందరు సీబీఐ అధికారులను బెదిరింపులకు గురి చేయడంతో పాటు మార్గమధ్యంలో వాహనాలకు అడ్డగించడం వంటి పరిణామాలు కూడా జరగడంతో  సీబీఐ ఈ కేసు విషయంలో గట్టి పట్టుదలతో పనిచేస్తోంది అని అంటున్నారు.

దాంతో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రనాధ్ రెడ్డి చెప్పినట్లుగా ఈ కేసులో అసలైన దోషులు ఎవరు అన్నది కొద్ది రోజులలో బయటకు వస్తుందా అన్నది ఆసక్తిని రేపుతోంది. ఈ కేసు విషయంలో  ఇస్తున్న పేర్లు కనుక బయటకు వస్తే కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు. అదే టైం లో వైసీపీకి కంచుకోట లాంటి కడపతో సహా వైసీపీ హార్డ్ కోర్ ఏరియాగా ఉన్న సీమలో కూడా కీలకమైన మార్పులు ఉంటాయని చెబుతున్నారు. దాంతో సీబీఐ ఏమి వెల్లడిస్తుంది అన్నది ఇపుడు ఇంటరెస్టింగ్ మ్యాటర్ గా ఉంది.

ఇదిలా ఉంటే వైసీపీ పాలన అంతా అవినీతిమయం అని డీఎల్ అంటున్నారు ఆఖరుకు ఎర్ర మట్టిని కూడా వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారు అని ఆయన నిందించారు దేశమంతా డిజిటల్ కరెన్సీ అమలు చేయాలని ఒక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇస్తూంటే మద్యం దుకాణాల్లో మాత్రం డబ్బుతోనే అమ్మకాలు చేస్తున్నారని, డిజిటల్ కరెన్సీ అయితే వాటాలు సరిగ్గా తేలవు కాబట్టే ఇలా చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. అవినీతికి కేరాఫ్ గా ఉన్న వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని డీఎల్ జోస్యం చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News