టీడీపీలో జ‌వ‌హ‌ర్‌కు పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డిందే...!

Update: 2021-09-19 01:30 GMT
టీడీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి కేఎస్‌. జ‌వ‌హ‌ర్ పార్టీలో చాలా త‌క్కువ టైంలో కీల‌క స్థానానికి ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్ల‌కే ఆయ‌న మంత్రి అయ్యారు. ఎస్సీ వ‌ర్గంలో పార్టీ త‌ర‌పున బ‌ల‌మైన వాయిస్ వినిపించారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎస్సీ వ‌ర్గాన్ని పార్టీకి చేరువ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. అలాంటి నేత‌కే చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న సిట్టింగ్ సీటు ఇవ్వ‌లేదు. ఆయ‌న అప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేగా ఉన్న కొవ్వూరును కాద‌ని.. కృష్ణా జిల్లాలోని తిరువూరు సీటు కేటాయించారు. కేవ‌లం చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గ‌మైన క‌మ్మ నేత‌ల ఒత్తిడికి త‌లొగ్గే చంద్ర‌బాబు మంత్రిగా ఉన్న జ‌వ‌హ‌ర్ గోడును కాద‌ని తిరువూరు పంపారు. తిరువూరులో ఆయ‌న ఓడిపోయినా కూడా గ‌ట్టిపోటీయే ఇచ్చారు. క‌ట్ చేస్తే పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా జ‌వ‌హ‌ర్ మీడియాలో పార్టీ వాయిస్ వినిపించే విష‌యంలో దూసుకు పోతున్నారు.

పార్టీ ప‌ద‌వుల పంపిణీలో జ‌వ‌హ‌ర్‌ను రాజ‌మ‌హేంద్ర‌వ‌రం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడిగా నియ‌మించారు. గ‌త ఎన్నిక‌ల్లో కొవ్వూరులో పోటీ చేసి ఓడిన వంగ‌ల‌పూడి అనిత‌ను తిరిగి పాయ‌క‌రావుపేట ఇన్‌చార్జ్‌గా పంపేశారు. ఇక జ‌వ‌హ‌ర్ పోటీ చేసిన తిరువూరుకు ఎన్నారై శామ‌ల దేవ‌ద‌త్‌ను ఇన్‌చార్జ్‌గా వేశారు. కొవ్వూరు ను మాత్రం ఎవ్వ‌రికి ఇవ్వ‌కుండా పెండింగ్‌లో పెట్టేశారు. ప్ర‌స్తుతం జ‌వ‌హ‌ర్ అధ్య‌క్షుడిగా ఉన్న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే కొవ్వూరు కూడా ఉంది. అయినా కొవ్వూరు జ‌వ‌హ‌ర్‌కు ఇచ్చేస్తారు అనుకుంటోన్న టైంలోనే బాబు మాత్రం నాన్చుతూ వ‌స్తున్నారు.

మ‌రోవైపు తిరువూరుకు కొత్త ఇన్‌చార్జ్ వ‌చ్చేశారు. జ‌వ‌హ‌ర్ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. పార్టీలో ఆయ‌న కీల‌క నేత‌గా ఉన్నారు. పైగా ఆయ‌న ఓ పార్ల‌మెంట‌రీ జిల్లాకు పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నా కూడా ఆ ప‌రిధిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గానికే ఇన్‌చార్జ్ కాలేక‌పోతున్నారు. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో ముందు నుంచి కీల‌కంగా ఉన్న ఓ జ‌మిందారి ఫ్యామిలీతో పాటు క‌మ్మ నేత‌ల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గే చంద్ర‌బాబు కొవ్వూరు ప‌గ్గాలు జ‌వ‌హ‌ర్‌కు ఇచ్చే విష‌యంలో నాన్చుతూ వ‌స్తున్నారు.

ఓ వైపు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండేళ్లే టైం ఉంది. ఇప్ప‌టి నుంచే వ‌ర్క్ స్టార్ట్ చేసుకుని.. తిరిగి కొవ్వూరులో ప‌ట్టు సాధించాల‌ని జ‌వ‌హ‌ర్ చూస్తున్నారు. ఇప్ప‌టికే మూడు సార్లు సిట్టింగ్‌లు అయ్యాయి. అయితే బాబు మాత్రం జ‌వ‌హ‌ర్ లాంటి కీల‌క నేత విష‌యంలో నాన్చుతున్నారే త‌ప్పా త‌న వ‌ర్గ నేత‌ల‌కు స‌ర్దిచెప్పుకోవ‌డం లేదు. జ‌వ‌హ‌ర్ మాత్రం తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొవ్వూరు నుంచి మాత్ర‌మే పోటీ చేస్తాన‌ని చెపుతున్నారు. మ‌రి ఈ పంచాయితీ ఎప్ప‌ట‌కి తేలుతుందో ? చూడాలి.




Tags:    

Similar News