30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌ లు లేరంట‌.. లోకేషే అన్నాడుగా!

Update: 2022-05-28 10:30 GMT
40 ఏళ్ల హిస్ట‌రీ ఉన్న పార్టీ. సుదీర్ఘ కాలం ఏపీని ఏలిన పార్టీ. 14 సంవ‌త్సరాలు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న పార్టీ.. అదే.. టీడీపీ. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం.. నినాదంతో వ‌చ్చిన పార్టీ. అయితే..అలాంటి పార్టీ ఇప్పుడు.. ఏకంగా.. 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందులు పడుతోంద‌ని.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న చంద్ర‌బాబు త‌న‌యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వెల్ల‌డించారు. ఇదేమీ.. చిన్న విష‌యం ఏమీ కాదు. రాష్ట్రంలో ఉన్న‌దే 175 నియోజ‌క‌వ‌ర్గాలు.

మరి వీటిలోనూ 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లు లేరంటే.. పార్టీకి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితేక‌దా! అంతేకా దు.. నిన్న‌గాక మొన్న పుట్టిన వైసీపీ.. టీడీపీ వ‌య‌సుతో పోల్చుకుంటే.. స‌గం కూడా లేని.. వైసీపీ దెబ్బ‌కు టీడీపీ ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు లోకేష్ వెల్ల‌డించ‌డం.

వంటివి పార్టీలోనూ.. రాజ‌కీయంగానూ చ‌ర్చ‌నీ యాంశం అయ్యాయి. వాస్త‌వానికి.. వైసీపీ కంటే కూడా.. బ‌లంగా ఉండాల్సిన టీడీపీ.. ఇలా ఎందుకు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రాతినిధ్యం లేని ప‌రిస్తితి వ‌చ్చిందో ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

క్షేత్ర‌స్థాయిలో పార్టీ దృష్టి పెట్ట‌క‌పోవ‌డం.. నేత‌ల‌ను న‌మ్మ‌క‌పోవ‌డం.. న‌మ్మిన‌వారు చెప్పిందే నిజ‌మ‌ని అనుకోవ‌డం.. వంటివి.. పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ‌నేది వాస్త‌వం. అంతేకాదు.. నాయ‌కుల‌పై పార్టీ ఆధార‌ప‌డ‌డం.. మ‌రీ ఇబ్బందిక‌రంగా మారింది.

నిజానికి వైసీపీని తీసుకుంటే.. నాయ‌కుడిపై.. పార్టీ ఆధార‌ప‌డింది. అంటే..నాయ‌కుడు చెప్పిన‌ట్టు పార్టీ న‌డుస్తుంది.. దీనివ‌ల్ల‌.. కొంద‌రు నేత‌లు బాధ‌ప‌డినా.. మొత్తంగా చూస్తే..పార్టీకి బ‌ల‌మైన పునాదితో పాటు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ పుంజుకుంది.

కానీ, ఈ త‌ర‌హా ప‌రిస్థితి టీడీపీలో లేదు. కేవ‌లం.. పార్టీనేత‌ల‌పై ఆధార‌ప‌డ‌డం.. క్షేత్ర‌స్థాయిలో వారి అభీష్టానికి పార్టీని వ‌దిలేయ‌డం.. వంటి ప‌రిణామాలే.. ఇప్ప‌డు.. తెలుగు దేశం పార్టీలో ఆధిప‌త్య పోరును రాజేసింది. అదేవిధంగా నాయ‌కులు కూడా స‌ర్వ‌తంత్ర స్వ‌తంత్రులుగా మారిపోయారు. అధినేత అంటే కూడా లెక్క‌లేని త‌నం ఏర్ప‌డింది. ఈ కార‌ణంగానే నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టుకోల్పోయింది. స‌రే.. ఇప్ప‌టికైనా.. త‌ప్పులు తెలుసుకున్నారు క‌నుక‌..మరి ఈ లోపాల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలు ఇప్ప‌ట‌కైనా.. ప్రారంభిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News