ఆయన మాజీ మంత్రి. అంటే.. సాధారణ ఎమ్మెల్యేతోనే సమానం. కానీ, ఆయన విషయంలో మాత్రం పరిస్థితి అలా లేదట. మంత్రి కన్నా ఎక్కువగానే ఇప్పటికీ.. ఆయన అన్నీ అనుభవిస్తున్నారని.. అంటు న్నారు పరిశీలకులు. ఆయనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ నియోజకవర్గంలో.. ఇప్పటికీ.. ఆయనదే మాట. ఆయనదే బాట.. అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం అంటున్నారు. తొలి మంత్రి వర్గం.. జగన్ ఎంతో ప్రేమగా ఆయన దేవదాయ శాఖను అప్పగించారు.
అయితే..మూడేళ్లపాటు ఈ పదవిలో ఉన్న వెల్లంపల్లి.. తీవ్ర వివాదాలు.. వచ్చినా.. ఎదురు దాడి చేసేందు కు మాత్రమే పరిమితమయ్యారు. ఆయన హయాంలోనే దేవాలయాలపై దాడులు జరిగాయి. విజయవాడ దుర్గమ్మ రథకానికి సంబంధించిన వెండి సింహాలు మాయమయ్యాయి. రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం జరిగింది. అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టారు. ఇలా చెప్పుకొంటూ.. పోతే.. బోలెడు వివాదాలు వెల్లంపల్లిని చుట్టుముట్టాయి.
ఇక, కారణాలు ఏవైనా..ఆయనను రెండో మంత్రి వర్గం నుంచి తప్పించారు. అయితే.. వెల్లంపల్లి మాత్రం.. ఇప్పటికీ.. మంత్రిగానే ఫీలవుతున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. నియోజకవర్గంలోనే కాదు.. విజయవాడలో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
శంకుస్థాపనలు.. రిబ్బన్ కటింగులు.. సమీక్షలు.. ఇలా.. అనేక కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగానే జరుగుతున్నాయి. తాజాగా విజయవాడ దుర్గమ్మ గుడిలో జరిగే.. దసరా శరన్నవరాత్రులు కూడా.. ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయని అంటున్నారు.
ఆయన చెప్పిన వారికేకొన్నిపనులకు టెండర్లు ఇచ్చారని.. అదేసమయంలో ఆయన వర్గానికే.. పనులు కూడా దక్కాయని అంటున్నారు. ఇక, నియోజకవర్గంలో వేరే పార్టీ వారిని ఒక్కరంటే ఒక్కరిని కూడా విమర్శించే అవకాశం లేకుండా చేస్తున్నారు. అంటే.. ఏదో అభివృద్ధి చేస్తున్నారని కాదు.. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారట. ఇదే విషయాన్ని జనసేన నేత.. పోతిన మహేష్.. రోడ్డెక్కి మరీ చెప్పారు.
మాజీ మంత్రి మంత్రిగా బిహేవ్ చేస్తున్నాడని.. ఇదేం పాలన అని.. ఆయన సీఎం జగన్‌నే ప్రశ్నించారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. మరి వెల్లంపల్లికి పై నుంచి ఉన్న అండదండలే రీజనా.. లేక నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా బలంగా లేదని.. తనే మోనార్క్ అని అనుకుంటున్నారా? అనేది ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.