బావ మృతి కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Update: 2021-03-12 17:30 GMT
బావ మృతికేసులో బావమరిదిని అరెస్ట్ చేశారు. అయితే ఆ బావమరిది అచ్చిపచ్చీ లీడర్ కాదు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేతల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈయన అరెస్ట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

బావ తేతలి సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో ఆయన బామ్మర్ధి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు రెడ్డి చాలాకాలంగా భార్య విజయలక్ష్మి, బిడ్డలను వదిలిపెట్టి మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

సత్తిరాజురెడ్డి మృతికి వారి కుటుంబ సభ్యులే కారణమంటూ సహజీవనం చేస్తున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన మృతి దేహాన్ని ఆమే తీసుకోవడం పెద్ద దుమారం రేపింది.

అయితే తన భర్త సత్తిరాజురెడ్డితో కొన్ని విభేదాల కారణంగా విడిగా ఉంటున్నామని.. తాము విడాకులు తీసుకోలేదని ఆయన భార్య విజయలక్ష్మీ తెలిపారు. తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆరోపించింది.

ఈ కేసులో తాజాగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.. దీనిపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
Tags:    

Similar News