2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అందులో భాగంగా ఇటీవలే సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మూడు జిల్లాలను చుట్టేసిన జగన్ యాత్ర ప్రస్తుతం టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతోంది. వైసీపీకి మంచి పట్టున్న కడప - కర్నూలు జిల్లాల్లో యాత్ర హోరెత్తగా - టీడీపీకి బలంగా ఉన్న అనంతపురం - చిత్తూరు జిల్లాల్లోనూ జనం జగన్ కు హారతులు పడుతున్నారు. అయితే జగన్ పాదయాత్ర మనోధైర్యాన్ని దెబ్బ తీసే క్రమంలో అధికార టీడీపీ... వైసీపీ ఎమ్మెల్యేలను లాగేందుకు యత్నించింది. ఆ యత్నంలో కొంతమేర సత్ఫలితాలే వచ్చినా... టీడీపీకి పెద్దగా కలిసి రాలేదన్న వాదన వ్యక్తమైంది. పాదయాత్ర ప్రారంభంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన జగన్... తనదైన శైలిలో చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరుగుతూ... తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న విషయాన్ని స్పస్టం చేస్తూ జనాన్ని బాగానే ఆకట్టుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో జగన్ యాత్రకు బూస్ట్‌లా పనిచేసే ఓ కీలక అంశం చంద్రబాబు సొంత జిల్లాలోనే కాసేపటి క్రితం చోటుచేసుకుంది. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో వైసీపీని వదిలి టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గాలకు అభ్యర్థుల కొరతేమీ లేకున్నా... గతంలో మాదిరి గట్టి అభ్యర్థులు దొరుకుతారా? అన్న సందేహాలైతే వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎమ్మెల్యే కుంభా రవబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో జగన్ యాత్ర కొనసాగుతుండగా... విశాఖ జిల్లా నుంచి తన అనుచర గణంతో అక్కడికి వచ్చిన కుంభా రవిబాబు... జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రవిబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు. గిరిజనులంతా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే గిరిజన హక్కులు రక్షించబడతాయని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉంటే... ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు పార్టీ వీడిన జిల్లా నుంచే మరో గిరిజన నేత పార్టీలోకి చేరడం నిజంగా జగన్‌కు కలిసివచ్చే అంశమేనని చెప్పాలి. ఎందుకంటే... ఇటీవలే టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి... గిరిజనంలో వైఎస్ జగన్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పకనే చెప్పేశారు. తన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్ధే విజయం సాధిస్తారని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరడం, అది కూడా గిరిజన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం జగన్ కు నిజంగానే కలిసివచ్చే అంశంగానే విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ చేరిక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చోటుచేసుకోవడం కూడా జగన్ యాత్రకు మంచి బూస్ట్ లభించినట్టేనన్న వాదన కూడా వినిపిస్తోంది.