రేవంత్ చెప్పాడ‌నే హెరాల్డ్‌కు విరాళ‌మిచ్చా: అంజ‌న్ కుమార్‌

Update: 2022-11-23 16:08 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు ఒక్కొక్కరిని పశ్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ను  బుద‌వారం ఈడీ అధికారులు  ఢిల్లీలో విచారించారు. త‌న కుమారుడితో సహా ఈ విచార‌ణ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన అంజ‌న్ కుమార్‌.. ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు ఈడీ ముందు కూర్చున్నారు.

ఈయన‌ను ప్రశ్నించిన ఈడీ.. యంగ్ ఇండియా లిమిటెడ్కు విరాళాలు సేకరణ గురించి ఆయన్ను ప్రశ్నించారు. అనంత‌రం దీనిపై మీడియాతో మాట్లాడిన అంజన్ కుమార్ యాద‌వ్ తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సూచన మేరకే ఆ సంస్థకు విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందనే కారణంగా స్వచ్ఛందంగా విరాళం ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ నేతలను ఈడీ విచారిస్తోందని ఆయన ఆరోపించారు. మళ్లీ విచారణ ఉంటే ఈడీ అధికారులు పిలుస్తామని ఆయన తెలిపారు.

అనేక సందేహాలు

అయితే, వాస్త‌వానికి అంజ‌న్ కుమార్ యాద‌వ్ కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడు. ఎప్ప‌టి నుంచో ఉన్నారు. 2017-2018 మ‌ధ్య‌లో మాత్ర‌మే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ త‌ర్వాత ఏడాదే ఆయ‌న పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించారు.

మ‌రి ఇంత‌లోనే ఆయ‌న చెప్ప‌డం.. అంజ‌న్ కుమార్ యాద‌వ్ పెట్టుబ‌డులు పెట్ట‌డం.. అనేది ఎలా జ‌రిగింద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. పైగా.. అప్పుడే పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించిన రేవంత్ పెట్ట‌మంటే అంజ‌న్ కుమార్ ఎలా పెడ‌తారు? అనేది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదేదో వ్యూహాత్మ‌కంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News