తాగిన మత్తులో మాజీ ఎంపీ వైపరీత్యం

Update: 2021-11-06 16:30 GMT
మద్యం మత్తులో.. దీపావళి రోజున మాజీ ఎంపీ ఒకరు అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారు. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే మాజీ ఎంపీ మద్యం మత్తులో వేరొక ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఆ ఇంటి యజమానిను చితకబాదాడు.

ఈ విషయంలో ఇంటి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎంపీ అనుచితంగా ప్రవర్తించడంతోనే దాడి చేశానని, ఆయన మాజీ ఎంపీ అని తెలియదని ఇంటియజమాని చెప్పడం గమనార్హం. కాగా, దాడిలో బాగానే దెబ్బలు తిన్న మాజీ ఎంపీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన చెబుతుండడం గమనార్హం.
Tags:    

Similar News