వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య అనూహ్య వార్తతో తెరమీదకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా సొంత కోడలి ఆత్మహత్య కేసులో అభియోగాలు నమోదు అయి కొన్నాళ్లపాటు జైలులో ఉన్న రాజయ్య ఆ తర్వాత పెద్దగా ఎక్కడా సందడి చేయలేదు. బెయిల్ పై విడుదలైనప్పటికీ ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా కొత్త సంవత్సర వేడుకల సందర్భంంగా ఈ మాజీ ఎంపీ కిరాక్ డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
జైలు జీవితం తర్వాత చాలా గ్యాప్ తో నూతన సంవత్సర వేడుకల్లో మాజీ ఎంపీ రాజయ్య పాల్గొన్నారు. వరంగల్ క్లబ్ లో న్యూఇయర్ సంబరాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ ఈ సందర్భంగా హల్ చల్ చేశారు. కేవలం వేడుకల్లో పాలుపంచుకోవడమే కాకుండా...సన్నిహితులతో కలిసి సరదాగా డాన్స్చేశారు. వేడుకల్లో భాగంగా పాటకు తగ్గట్టుగా స్టెప్పులు - హావభావాలను మార్చుతూ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ డ్యాన్స్ ను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వెంటనే వీడియోలు వైరల్ అయ్యాయి.