హైదరాబాద్ పబ్ కేసులో మాజీ ఎంపీ అల్లుడు?

Update: 2022-04-04 10:49 GMT
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది.  ఈ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.  ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడు కిరణ్ రాజ్ ను పబ్ కేసులో నిందితుడిగా చేర్చారు.

ఈ కేసులో ఏ1గా అనిల్, ఏ2గా అభిషేక్, ఏ3గా అర్జున్, ఏ4 గా కిరణ్ రాజ్ ను చేర్చడం సంచలనమైంది. ఇప్పటికే పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్ లు నిన్న అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైలులో ఉన్నారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ పబ్ లో డ్రగ్స్ మాత్రమే కాదు.. మైనర్లకు మద్యం పోస్తున్నారు. శనివారం రాత్రి పోలీసుల రెయిడ్ లో దొరికిన వాళ్లలో ఆరుగురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాను ఏ తప్పుచేయలేదని చెప్తున్న జూనియర్ ఆర్టిస్ట్ వయసు కూడా 20 ఏళ్లేలోపే ఉంది.

21 ఏళ్లు దాటితేనే పబ్ లోకి అనుమతించాలి. మద్యం సప్లై చేయాలన్నా 21 ఏళ్లు ఉండాలి. కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ 21 ఏళ్లు దాటకపోవడంతో ఆమెను లోపలికి ఎలా అనుమతించారని హాట్ టాపిక్ గా మారింది. పైగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఒక వీడియో కూడా విడుదల చేసింది.

ఈ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లోనూ ఆసక్తికర పాయింట్లు ఉన్నాయి. ముందు ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు తాజాగా నాలుగో నిందితుడిని చేర్చారు.  అనిల్, అభిషేక్, అర్జున్ తో పాటు ఇప్పుడు కిరణ్ రాజ్ కూడా నిందితుడే. ఈ పబ్ కు లీగలైజర్ గా కిరణ్ రాజ్ వ్యవహరిస్తున్నారు.  అందుకే ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదైంది.

పోలీసులు ఈ పబ్ పై దాడి చేసిన టైంలో రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీల పిల్లలు ఉన్నారు. దీంతో తమ పిల్లలకు ఈ డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వారు వివరణ ఇస్తున్న పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News