డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తుల్లో సాధారణ పౌరులు, ఈవెంట్ మేనేజర్లు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అయితే, తన మేథస్సుతో ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాల్సిన శాస్త్రవేత్త కూడా డ్రగ్స్ సరఫరా చేస్తుండడం కలకలం రేపుతోంది. తాజాగా, నాసాకు చెందిన ఓ మాజీ శాస్త్రవేత్తను డ్రగ్స్ సరఫరా కేసులో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
అనిష్ దుందో (29) డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక డూన్ స్కూల్ లో విద్యనభ్యసించాడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాసాలో శాస్త్రవేత్తగా పనిచేశాడు. ఆ తర్వాత 2012 లో హైదరాబాద్ కు వచ్చి వ్యాపారంలో స్థిరపడ్డాడు.
అనిష్....డార్క్ నెట్ ద్వారా బిట్ కాయిన్స్ చెల్లించి డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనిష్ వంటి ఉన్నత విద్యావంతులు డ్రగ్స్ అమ్ముతుండడం విస్మయానికి గురిచేసిందని విచారణ అధికారి ఒకరు తెలిపారు. గత పది రోజుల్లో దొరికి డ్రగ్స్ సరఫరాదారుల కాల్ డేటా ఆధారంగా అనిష్ ను అరెస్టు చేశామన్నారు. సికింద్రాబాద్ లోని అతడి ఆఫీసు నుంచి 16 ఎల్ ఎస్ డీ స్ట్రిప్ లు, 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.