ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి సోమవారం అరెస్టయ్యారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. రూ.25 కోట్ల రుణ చెల్లింపు వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్ సీ)కి విక్రయించడం లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయన పై ఆరోపణ ఎదుర్కొన్నాయి. అయితే ఢిల్లీలో ఆయనను అరెస్ట్ చేసి, జైసల్మేర్ కు తీసుకువచ్చినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
పోలీసు చెప్పిన వివరాల ప్రకారం 2007లో జైసల్మేర్‌లో ‘గర్ రాజ్‌వాడ’ హోటల్ ప్రాజెక్టుకుగాను గోడవన్ గ్రూప్‌నకు ఎస్‌బీఐ దాదాపు రూ.25 కోట్ల రుణం అందించింది. మూడేళ్లపాటు ఆ ప్రాజెక్టు ఎటువంటి పురోగతి లేదు. 2010లో ఈ అకౌంట్ మొండిబకాయిగా (ఎన్ పీఏ) మారింది. రుణ పరిష్కార కేసులో దాదాపు రూ.200 కోట్ల విలువైన హోటల్ ప్రాపర్టీని సీజ్ చేసి, మోసపూరిత మార్గాల ద్వారా కేవలం రూ.25 కోట్లకే అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్ సీ)కి విక్రయించినట్లు చౌదరిపై 2015లో కేసు నమోదైంది. హోటల్ ను కొనుగోలు చేసిన కంపెనీ బోర్డు డైరెక్టర్ గా చౌదరి చేరడం వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా కనబడుతోంది.
అయితే విక్రయించేటప్పుడు అన్ని విధి విధానాలను అనుసరించినట్లు ఎస్ బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సంఘటనల తీరు గురించి కోర్టుకు సరిగ్గా వివరించినట్లు కనిపించడం లేదని బ్యాంక్ తెలిపింది. ఈ కేసులో ఎస్ బీఐ పార్టీ కాదని, కోర్టు విచారణలో భాగంగా బ్యాంకు అభిప్రాయాలను వినిపించే సందర్భం ఏదీ రాలేదని వివరించింది. చౌదరి సెప్టెంబర్ 2013లో పదవీ విరమణ చేసినట్లు ఎస్ బీఐ తెలిపింది. ప్రతీప్ చౌదరి అరెస్టు ప్రేరేపితమైన, తీవ్రమైన చర్యని ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఏఆర్‌సీలకు ఆస్తులను విక్రయించడానికి ఆర్ బీఐ మార్గదర్శకాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగానే జరిగినట్లు సుస్పష్టం. ఇక్కడ అవినీతి ఎక్కడుంది అని కుమార్ ప్రశ్నించారు.