త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నారు బీసీ నేత ఆర్.కృష్ణయ్య. ఈ మేరకు కొన్ని ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణయ్య ఒకనాడు వైఎస్సార్-కు ఎంతో చేరువ.
అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా చేయించిన ఘటనలు ఉన్నాయి. ఘనత కూడా ఉంది. కాల గతిలో ఆర్ కృష్ణయ్య తెలంగాణకే పరిమితం అయిపోయారు. ఒకానొక దశలో షర్మిలక్కకు అండగా నిలుస్తారు అన్న వార్తలూ వచ్చాయి. ఇప్పుడీయన రాజ్యసభకు వెళ్లనున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వాస్తవానికి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల్లో ఎవరు జాబితాలో పేరు దక్కించుకున్నారో ఇప్పటికే అంతుపోలడం లేదు. ఆఖరి నిమిషం వరకూ సస్పెన్స్ కొనసాగే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ సీనియర్లు అంత క్యేపబుల్ కాదన్న వాదన కూడా లేకపోలేదు.
అందుకే సీనియర్లను కాదని ఆర్.కృష్ణయ్యకు ఛాన్స్ ఇస్తున్నారు అని ఓ వాదన కూడా వినపడుతోంది. ఇప్పటిదాకా నాలుగు సీట్లకు గాను ఒక్కటంటే ఒక్క పేరు మాత్రం కన్ఫం అయింది. అదే సాయిరెడ్డి పేరు. తాజా పరిణామాల నేపథ్యంలో బీద మస్తాన్ రావుకు నో ఛాన్స్ అని తేలిపోయింది.
చెప్పలేం కానీ ఆఖరి నిమిషాన ఏమయినా జరగవచ్చు. బీసీ మహిళా కోటాలో ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి కృపారాణి పేరు ఫిక్స్ అయిందని టీడీపీ అనుకూల మీడియా కూడా ప్రచారం చేస్తోంది. ఇక రెండు స్థానాలలో ఎవరు అన్నది ఇప్పటికీ తేలని విషయం.
మర్రి రాజశేఖర్ పేరు కూడా వినిపించాక ఆయన వర్గాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇవి కాకుండా ఇంకొన్ని పేర్లు వస్తున్నాయి. ఏవీ ఇప్పటిదాకా నిర్థారణలో లేని వార్తలే !