'నా గుండెను తరుచూ మారుస్తుంటారు'..!

Update: 2022-12-21 01:30 GMT
ఒకప్పుడు అవయవ దానం చేయాలంటే చాలామంది వెనకడుగు వేసేవారు. అవయదానం చేస్తే వచ్చే జన్మలో అవయవ లోపంతో పుడుతారనో లేదంటే మరే ఇతర కారణమో గానీ చాలామంది ముందుకు వచ్చేందుకు జంకేవారు. అయితే ఎన్జీవోలు.. ఇతర ప్రముఖులు.. వైద్యుల కృషి ఫలితంగా ప్రస్తుతం చాలా మందిలో మార్పు వచ్చింది. దీంతో అనేక మంది అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

చనిపోయిన తర్వాత కళ్ళను దానం చేయడం లేదా యాక్సిడెంట్ సమయాల్లో చనిపోతారనుకునే వాళ్లు తమ అవయవాలను మరొకరి దానం చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ అవయవ దానం వల్ల కొంతమంది చూపు వస్తే.. మరొకరికి ఏకంగా పోయే ప్రాణం తిరిగి వస్తుంది. దీంతో అవయ దానానికి ముందుకు వచ్చిన వారిపై ప్రతీఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదే విషయంపై ‘లైట్ ఏ లైఫ్’ ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు రీనా రాజు తాజాగా మాట్లాడారు. అవయదానం వల్లే తాను ఇంకా బ్రతికి ఉన్నట్లు రీనా రాజు తెలిపారు. తనకు ఇప్పటి వరకు రెండు సార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్లు వెల్లడించారు. తనకు డైలేటెడ్ కార్డియోమయోపతి అనే వ్యాధి ఉందని తెలిపారు. దీని వల్ల కండరాల్లో రక్త సరఫరాకు ఆటంకం గుండె ఆగి పోతుందని వివరించారు.

తన గుండె ఆగిపోతుందనకున్నప్పుడల్లా తన తల్లిదండ్రులు తనకు గుండె మార్పిడి చేయించే వారన్నారు. అయితే దీనికి అయ్యే ఖర్చును పేదలు భరించలేరని తెలిపారు. అవయవ దానం వల్లే తాను ఇంకా జీవించి ఉన్నానని చెప్పారు. తనలాంటి వారికి తిరిగి జీవితాన్ని అందించడం కోసమే 2011లో ‘లైట్ ఏ లైఫ్’ అనే చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించినట్లు రీనా రాజు తెలిపారు.

ఈ ఎన్టీవో పేద రోగులకు అవయవ దానం చేయడంతో పాటు ఆర్థిక పరంగా సహాయం అందించడంలో ముందుంటుందని తెలిపారు. మనకు ఉన్నది ఒక్కటే జీవితమని దానిని ఆపన్నులకు సాయం అందించడమే లక్ష్యమని ఆమె వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు కూడా పేద రోగులకు ఆర్థిక సాయం అందిస్తానని వెల్లడించారు.

ఇక తనకు క్రీడలంటే ఇష్టమని రీనా రాజు తెలిపారు. దీంతో గుండెమార్పిడి జరిగిన తర్వాత కొన్ని నెలల తర్వాత వైద్యుల సలహా మేరకు బ్యాడ్మింటన్.. సైక్లింగ్ వంటి క్రీడలు ప్రాక్టీస్ చేస్తుంటానని తెలిపారు. అలాగే ప్రతియేటా జరిగే వరల్డ్ ట్రాన్స్ ప్లాంట్ గేమ్స్ లోనూ.. దేశ విదేశాల్లో జరిగే మారథాన్ లోనూ పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పిస్తుంటానని రీనా రాజు వెల్లడించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News