ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు లిబియాలో నలుగురు భారతీయులను అపహరించినట్లు అంతర్జాతీయంగా వార్తలొస్తున్నాయి. వారిలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారని చెబుతున్నారు. ఆంధ్రలో ఏ ప్రాంతానికి చెందినవారన్నది తెలియనప్పటికీ అపహరణకు గురయిన తెలుగు వ్యక్తి పేరు గోపీకృష్ణగా చెబుతున్నారు.
అపహరణకు గురయిన నలుగురు భారతీయులు లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇందులో ఒకరు, ఆంధ్ర కు చెందిన గోపీ కృష్ణ కాగా, ఇంకొకరిది కర్ణాటక రాష్ట్రం. బాధిత కుటుంబాలతో ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. నలుగురిని కిడ్నాప్ చేసిన ఐసిస్ తీవ్రవాదులు ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్లు చేయలేదని ఎంబసీ అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది. వీరిని బుధవారమే కిడ్నాప్ చేశారని అధికారవర్గాల భోగట్టా.
ఐసిస్ దారుణాల గురించి ఇప్పటికే తెలియడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని విడిపించేందుకు ఎంబసీ అధికారులు దారులు వెతుకుతున్నారు.