తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేయడం పార్టీ అధినేత చంద్రబాబును కలవరపెడుతోంది. అయితే... వంశీ ఒక్కరే కాదని.. మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలూ వైసీపీలో చేరడానికి ట్యూన్ అవుతున్నారన్న ప్రచారం ఆయా నియోజకవర్గాల్లో వినిపిస్తోంది.
ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని.. ఈ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల మధ్య రాయబారాలు జరుగుతున్నాయని ప్రకాశం జిల్లాలో ప్రచారమవుతోంది. ముఖ్యంగా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్‌పై గెలిచిని సీనియర్ నేత, మాజీ మంత్రి కరణం బలరాం.. పరుచూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై గెలిచిని ఏలూరు సాంబశివరావు... అద్దంకిలో చెంచు గరటయ్యపై గెలిచిన గొట్టిపాటి రవికుమార్.. కొండపిలో గెలిచిన జీ.బాలవీరాంజనేయ స్వామి ఈ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు ఏపీలో ఇసుక కొరతపై చేపడుతున్న కార్యక్రమాల్లో వీరు పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ వీరు యాక్టివ్‌గా లేరని వినిపిస్తోంది. మరోవైపు కరణం బలరాం ఇటీవల బీజేపీ నేత సుజనా చౌదరినీ కలిశారు. మిగతా ముగ్గురిలో గొట్టిపాటి రవికుమార్‌కు వైసీపీతో మంచి యాక్సెస్ ఉంది. మొత్తానికి వీరు నలుగురూ టీడీపీలో ఉండి ఇక లాభం లేదన్న ఉద్దేశంతో పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలనుకుంటున్నారని సమాచారం. అయితే.. వీరి రాజీనామాలతో వచ్చే ఉప ఎన్నికల్లో మళ్లీ తమకే టిక్కెట్లు ఇవ్వడం కానీ.. ఇతర పదవులు కానీ ఇవ్వాలని షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. దానికి జగన్ ఎంతవరకు ఓకే చెప్తారనేదాన్ని బట్టి వీరి చేరికలుంటాయి.