ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి చిన్న, పెద్ద, ముసలి, ముతకా అని తేడా లేకుండా ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో నాలుగు నెలల చిన్నారికి వైరస్ సోకడంతో 18 నెలల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుని వైరస్ ను జయించి అమ్మ ఒడికి చేరింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీకి వైరస్ సోకింది. అయితే వైద్యులు అనుమానంతో ఆమె నాలుగు నెలల చిన్నారికి సైతం వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆ చిన్నారికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దాంతో చిన్నారికి చికిత్స అందించేందుకు మే 25న విశాఖపట్నంలోని వీఐఎంఎస్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రిలో 18 రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచి చిన్నారికి చికిత్స చేశారు.
18 రోజులు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకున్న చిన్నారి చివరికి వైరస్ ను జయించింది. మరోసారి నిర్ధారణ చేసుకునేందుకు ఆ చిన్నారికి వైద్య పరీక్షలు చేయడంతో నెగిటివ్‌గా వచ్చింది. శుక్రవారం సాయంత్రం చిన్నారికి అన్ని పరీక్షలు చేసి ఆస్పత్రి నుంచి ఇంటికి డిశ్చార్జి చేశారు. పాప ఆరోగ్యంగా ఉందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాతో చెప్పారు.