కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కరోనాకి సరైన వ్యాక్సిన్ లేదని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించినప్పటికీ కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది. దీంతో అటు ప్రజలు - ఇటు ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొదట కుటుంబ యాజమానికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి..దీనితో అనుమానంతో అతని కుటుంబ సభ్యులు అందరికీ పరీక్షలు చేయగా.. అతడి భార్య - కుమారుడు - కుమార్తెకు సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పాజిటివ్ వచ్చింది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే.. జల్ పల్లి మున్సిపాలిటీలో ఒకే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. జల్ పల్లి మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మత ప్రార్థనలకు ఢిల్లీకి వెళ్లొచ్చాడు. ఆ తరువాత అతడికి కరోనా పాజిటివ్ అని రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబసభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఆ తరువాత కుటుంబ సభ్యులకి కరోనా పరీక్షలు నిర్వహించగా ..వారికీ కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది.
ఈ ముగ్గరు కూడా ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. మరికొందరు సభ్యులకు నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పాజిటివ్ వచ్చిన నలుగురిలో ముగ్గురు వీరే కావడం గమనార్హం. మరొకరు హఫీజ్ పేటకు చెందిన వ్యక్తి అని అధికారులు తెలియజేశారు. అలాగే , కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ మృతిచెందిన నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఆదివారం అలజడి రేగింది. అదే ప్రాంతంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రచారం జరగడంతో స్థానికుల్లో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమైంది. అయితే ఎవరిలోనూ లక్షణాలు లేవని వైద్యఆరోగ్య అధికారులు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయవద్దు అని కోరారు.