మందుబాబులకు కేటగిరీలు వచ్చాయి!

Update: 2016-07-23 11:30 GMT
మేరి పప్పిన్స్‌ - ద నట్టి ప్రొఫెసర్‌ - ద ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే - మిస్టర్‌ హైడ్... ఇవన్నీ ఏమిటి? హాలీవుడ్ సినిమా పేర్లు వరుసగా రాశారు అనుకుంటున్నారా? అదేమీ కాదండి.. మందుబాబులను నాలుగురకాలుగా విభజించి ఈ నాలుగు పేర్లు పెట్టారు పరిశోధకులు. అసలు ఈ పేర్లేమిటి.. ఆ నాలుగు రకాల మందుబాబులను ఏ ప్రాతిపదికన విభజించారు.. అందుకు గల కారణాలేమిటి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందా!

మద్యం తాగిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎందుకు ప్రవర్తిస్తారు? వారిలో అధికశాతం మంది ఎలా ప్రవర్తిస్తారు? మొదలైన అంశాలపై కొలంబియాలోని మిస్సోరి యూనివర్సిటీ సైకాలజీ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. దీనికోసం సుమారు 374మంది అండర్ గ్రాడ్యుయట్ల సహకారాన్ని తీసుకున్నారు. ఈ అధ్యయనంలో మందుబాబులు నాలుగురకాలుగా ఉంటారని తేల్చారు. వారికి మేరి పప్పిన్స్‌ - ద నట్టి ప్రొఫెసర్‌ - ద ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే మిస్టర్‌ హైడ్ అనే నామకరణాలు కూడా చేశారు.

* మందుబాబుల్లో అత్యధికంగా సుమారు 40శాతం మంది ఎర్నెస్ట్ హెమ్మింగ్వే కేటగిరీకి చెందినవారే ఉంటారట. హెర్నెస్ట్ హెమ్మింగ్వే అనే ప్రముఖ రచయిత పేరును ఈ కేటగిరీకి పెట్టారు. ఎందుకంటే తాను ఎంత ఎక్కువ విస్కీ తాగినా.. తాగినట్టే కనిపించనని హెమ్మింగ్వే చెప్పేవారట. దాంతో... ఈ కేటగిరీ వారందరికీ ఆయనపేరే పెట్టారు పరిశోధకులు.

* నట్టి ప్రొఫెసర్‌ అనేది హాలీవుడ్‌ సినిమా పేరు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలాగానే ఈ కేటగిరీకి చెందిన మందుబాబులు కూడా నేచురల్ గా ఆంతర్ముఖులై ఉండి.. మద్యాన్ని సేవించినప్పుడు మాత్రం తమ సహజత్వాన్ని, సహజ భయాన్ని పక్కనబెట్టి మరింతగా ప్రజలతో కలిసిపోతారట!

* మేరీ పప్పిన్స్‌ అనేది 1964లో వచ్చిన హాలీవుడ్ సినిమా పేరు. ఈ సినిమాలో మేరి పప్పీన్స్‌ పాత్ర మాదిరిగానే సంతోష సమయాల్లో - తమ సంతోషాన్ని మరింత పెంచుకోవడానికి - ఎంజాయ్ చేయడానికి ఈ కేటగిరీ బాబులు మద్యాన్ని సేవిస్తారట.

* ఇక మిస్టర్ హైడ్‌ కేటగిరీకి విషయానికొస్తే.. ఈ తరహా డ్రింకర్స్ బాధ్యతాయుతమైన వ్యక్తులు కాకపోవడమే కాకుండా, పెద్దగా తెలివితేటలు కూడా కలిగి ఉండరు. వీరు మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుంటారట! మిగిలినవారి కంటే.. ఈ నాలుగో కేటరిగిరీ మందుబాబులపైనే మద్యం చాలా రాక్షసమైన ప్రభావాన్ని చూపుతుందట!
Tags:    

Similar News