ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల తయారీ మొదలైపోయింది.. విభజన తరువాత నానా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి 'విశ్వ' ప్రయత్నాలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కలలు నెరవేరాయి.. ఏపీ మొబైల్ హబ్ గా మారడానికి అడుగులు పడుతున్నాయి.. ప్రఖ్యాత మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ ఏపీలో శ్రీసిటీలో మొబైళ్ల తయారీ మొదలుపెట్టింది. ఏపీ గవర్నమెంటుతో మూడు నెలల కిందట ఒప్పందం చేసుకున్న ఈ సంస్థ వెంటవెంటనే తన యూనిట్ ను ఏర్పాటు చేసేసింది. షావోమీ పేరుతో అప్పుడే తయారీ ప్రారంభించింది కూడా.
ఫాక్స్ కాన్ సంస్థ ఏపీలో యాపిల్, సోనీ, తదితర సంస్థల మొబైళ్లను తయారు చేయడానికి ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై ఇండియా, పరిసర ఆసియా దేశాల్లో అమ్ముడయ్యే యాపిల్, సోనీ ఫోన్లన్నీ శ్రీసిటీలోనే తయారవుతాయి.
నిజానికి ఫాక్స్ కాన్ తొలుత చైనా నుంచి బయటపడి మన దేశంలోని గుజరాత్, తమిళనాడుల్లో యూనిట్లు పెట్టాలనుకుంది. అయితే.. చంద్రబాబు చొరవతో ఆ కంపెనీ ఏపీలోని శ్రీసిటీలో తన యూనిట్ ను ఏర్పాటు చేసి రెండున్నర నెలల్లోనే ఉత్పత్తి కూడా మొదలు పెట్టడం విశేషం. శ్రీసిటీలో మౌలిక సదుపాయాలన్నీ ఉండడం.... అక్కడ రెడీ టు బిల్డ్ పేరిట రెడీమేడ్ షెడ్లు ఉండడంతో ఫాక్స్ కాన్ కు ప్లాంటు స్థాపించడం చాలా సులభమైపోయిది. ఆ కారణంగానే ఆ సంస్థ వెంటనే అక్కడ తన ఉత్పత్తి మొదలుపెట్టగలిగింది.
మొత్తానికి ఏపీని పారిశ్రామిక కేంద్రంగా మలచాలన్న చంద్రబాబు యత్నాలకు శ్రీసిటీ కేంద్రంగా ఫాక్స్ కాన్ శ్రీకారం చుట్టింది. మిగతా సంస్థలు కూడా ఇక్కడి రెడీ టు బిల్డ్ షెడ్లలో ప్లాంటుల ఏర్పాటుకు తొందరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో మరిన్ని పరిశ్రమలు ఇక్కడ నుంచి ఉత్పత్తి ప్రారంభించడం ఖాయం.