సోక‌ర్ విజేత‌ల‌కు ద‌క్కింది ఎంతో తెలుసా?

Update: 2018-07-16 05:21 GMT
మ‌రో ప్ర‌పంచ సంరంభం ముగిసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ క్రీడాకారులు సుమారు న‌ల‌భై రోజుల‌కు పైగా పండ‌గ చేసుకున్న సాక‌ర్ పండ‌గ పూర్తి అయ్యింది. మ‌ళ్లీ నాలుగేళ్ల‌కు కానీ ప్ర‌పంచ క‌ప్ టోర్నీ హ‌డావుడి రాదు. ఈసారి ప్ర‌పంచ ఫుట్ బాల్ టోర్నీ విజేత‌గా ఫ్రాన్స్ అవ‌త‌రించిన విష‌యం తెలిసిందే.

సంచ‌ల‌నాల క్రోయేషియా జ‌ట్టును ఫైనల్లో ఓడించి.. అనుభ‌వానికే అంతిమ విజ‌య‌మ‌న్న విష‌యాన్ని ఫ్యాన్స్ జ‌ట్టు నిరూపించింది. మాజీ ఛాంపియ‌న్ అయిన ఫ్రాన్స్.. మ‌రోసారి విశ్వవిజేత‌గా నిలిచింది. గ్రూపు ద‌శ‌లో అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించి.. అర్జెంటీనాను మ‌ట్టిక‌రిపించిన ఫ్రాన్స్.. త‌ర్వాత ఉరుగ్వేను ఇంటికి పంపి.. త‌ర్వాత బెల్జియంకు చెక్ పెట్టి ఫైన‌ల్స్ కు చేరిన ఫ్యాన్స్ టీం.. త‌మ విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించి ప్ర‌పంచ‌క‌ప్ సొంతం చేసుకున్నారు.

ప్ర‌పంచ ఫుట్ బాల్ టోర్నీ హ‌డావుడి ఓప‌క్క సాగుతున్న వేళ‌లోనే.. లాస్ వెగాస్ లో మ‌రో ప్ర‌పంచ సీరిస్ ఒక‌టి జ‌రిగింది. కాకుంటే.. అంద‌రి దృష్టిని పెద్ద‌గా ఆక‌ర్షించ‌ని ఈ టోర్నీ మ‌రేదో కాదు.. ప్ర‌పంచ పోక‌ర్ సిరీస్‌. ప‌రిమిత‌మైన వ‌ర్గాల‌కు మాత్ర‌మే ఆస‌క్తి చూపించే ఈ టోర్నీ కూడా ఆదివారం రాత్రి ముగిసింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌పంచ పోక‌ర్ టోర్నీ విజేత‌కు ద‌క్కిన ప్రైజ్ మ‌నీతో పోలిస్తే.. ప్ర‌పంచ ఫుట్ బాల్ టోర్నీ విజేత‌ల‌కు ల‌భించిన మొత్తం త‌క్కువ‌గా ఉండ‌టం.

ఆస‌క్తిక‌రంగా సాగిన ఫుట్ బాల్ టోర్నీ ఫైన‌ల్ లో క్రోయేషియా జ‌ట్టును 4-2 తేడాతో ఫ్రాన్స్ ఓడించి ప్ర‌పంచ క‌ప్ తో పాటు రూ.262 కోట్ల ప్రైజ్ మ‌నీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌పంచ పోక‌ర్ సిరీస్ ను 33 ఏళ్ల జాన్ సిన్ సొంతం చేసుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన టోనీ మైల్స్ అనే ఆట‌గాడితో నువ్వానేనా అన్న‌రీతిలో సాగిన గేమ్ లో విజేత‌గా నిలిచారు. శ‌నివారం రాత్రి స్టార్ట్ అయిన ఈ సిరీస్ ఆదివారం ఉద‌యం వ‌ర‌కూ నిర్విరామంగా సాగింది.

ప్ర‌పంచ పోక‌ర్ సిరిస్ లో విజేత‌గా ఆవిర్భ‌వించిన జాన్ సిన్ ఏకంగా రూ.60 కోట్ల ప్రైజ్ మ‌నీని సొంతం చేసుకున్నాడు. ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన  టోని రూ.34 కోట్ల‌కు స‌రిపెట్టుకున్నాడు. ఇక.. మూడో స్థానంలో నిలిచిన మైకేల్ డ‌య‌ర్ రూ.25 కోట్లు మాత్ర‌మే మిగిలాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌పంచ సోక‌ర్ టోర్నీలో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన క్రోయేషియా జ‌ట్టుకు రూ.190 కోట్లు ద‌క్కాయి. మొత్తంగా చూస్తే సోక‌ర్ విజేత‌లు.. ప‌రాజితుల‌తో పోలిస్తే.. పోక‌ర్ విజేత‌..ప‌రాజిత‌ల‌కే ఎక్కువ‌గా ల‌భించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News