ఫ్రాన్స్ ప్రపంచ కప్ కలలో తుపాను.. కీలక ఆటగాళ్లకు అనారోగ్యం

Update: 2022-12-17 11:30 GMT
మరొక్క రోజే.. ప్రపంచ విజేతగా నిలవడానికి.. అది కూడా వరుసగా రెండోసారీ జగజ్జేతగా ఆవిర్భవించడానికి.. అదే జరిగితే మరో చరిత్ర.. కానీ, ఆ జట్టుకు షాక్.. ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు కీలక ఆటగాళ్లకు అనారోగ్యం. వారు మైదానంలోకి దిగే పరిస్థితి లేదు. దీంతో మేనేజ్ మెంట్ లో కలవరం. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇదీ ప్రస్తుతం ఫ్రాన్స్ ఉన్న స్థితి. ఆదివారం అర్జెంటీనా లాంటి జట్టుతో తలపడనున్న ఫ్రెంచ్ మన్లకు ఊహించని దెబ్బ. క్రొయేషియా కాదిది.. అర్జెంటీనా 1998 ప్రపంచ కప్ ఫైనల్లో బ్రెజిల్ వంటి దిగ్గజాన్ని ఓడించి కప్ గెలిచించి ఫ్రాన్స్. అయితే.. నాడు మ్యాచ్ కు అనూహ్య పరిస్థితుల్లో రొనాల్డో దూరం కావడం ఫ్రాన్స్ కు కలిసివచ్చింది. అయితే, 2006 ఫైనల్లో ఇటలీ ఫైనల్లో మెటరాజ్జీ-జిదానె మధ్య గొడవతో ఫ్రాన్స్ ఏకాగ్రత చెదిరి పరాజయం పాలైంది. ఇక 2018లో మాత్రం క్రొయేషియాలాంటి జట్టు ఎదురైంది. వాస్తవానికి క్రొయేషియా మంచి జట్టే అయినా ఫైనల్స్ కు చేరడం వారికదే తొలిసారి. దీంతో ఆ ఒత్తిడి క్రొయేషియన్లపై కనిపించింది. దీంతో ఫ్రాన్స్ గెలుపు సులువైంది. అదే ఊపులో ఇప్పుడు రెండోసారీ ఫైనల్ కు వచ్చి చరిత్ర
లిఖించింది. కానీ, స్టార్‌ డిఫెండర్లు రాఫెల్ వరానె, ఇబ్రహిమా కొనాటెతోపాటు అటాకర్‌ కింగ్‌స్లే కోమన్ జట్టుకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది.

వీరు ముగ్గురూ అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో నిన్న జరిగిన ట్రైనింగ్‌ సెషన్‌లోనూ పాల్గొనలేదు. "స్వల్ప వైరల్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. దీంతో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనలేదు" అని ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌) వెల్లడించింది. కొనాటే సెమీస్ మ్యాచ్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో డయోట్ పామెకానోను తీసుకొంది. మరోవైపు అటు ఫైనల్ ప్రత్యర్థి అర్జెంటీనా. స్టార్ ఫార్వర్డ్ లయోనల్ మెస్సీ మాంచి ఫామ్ లో ఉన్నాడు. కప్ అందుకోవడం అతడి కల. అందులోనూ ఎన్నో ఫైనల్స్ ఆడి ఉన్న అనుభవం. గతంలోనూ రెండుసార్లు చాంపియన్ గా నిలిచిన చరిత్ర అర్జెంటీనాది. ఈ నేపథ్యంలో పోయిన సారిలా క్రొయేషియాను ఓడించినట్లు సులువుగా ఓడించడం ఫ్రాన్స్ కు సాధ్యం కాదు. ఇదే సమయంలో కీలక ఆటగాళ్లు దూరం కానుండడం వారిని కలవరానికి గురిచేస్తోంది.

అయినా వీరున్నారుగా.. గ్రీజ్ మన్, హెర్నాండెజ్, ఎంబాప్పె, ఒలివియర్ గిరోడ్ వీరంతా ఫ్రాన్స్ మేటి ఆటగాళ్లు. ఈ బలగాన్ని చూసే ఫ్రాన్స్ ను బెదిరిపోయే పరిస్థితి. కానీ, వీరికి తోడ్పాటు అందించేవారు కావాలి కదా..? ఫుట్ బాల్ లో పాస్ లు కీలకం. అందులోనూ గోల్ పోస్ట్ దగ్గర ఎంత చురుగ్గా పాస్ దొరకబుచ్చుకుంటే అంత తొందరగా స్కోరవుతుంది. సెమీ ఫైనల్లో కార్నర్ నుంచి మెస్సీ అందించిన పాస్ ను గోల్ పోస్ట్ దగ్గర అల్వారెజ్ ఎంత లాఘవంగా గోల్ చేశాడో అందరూ చూశారు. ఇలాంటి నైపుణ్యమే ఫైనల్స్ లో మరింతగా అవసరం అవుతుంది. కాబట్టి ఆటగాళ్ల అనారోగ్యం సమస్యను ఫ్రాన్స్ ఎంత తొందరగా అధిగమిస్తుందో చూడాలి. కాగా, దీనిపై ఫ్రాన్స్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు రాన్‌డల్ కోలో మౌని మాట్లాడుతూ.. "కొందరికి కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపించాయి. అయితే ఇవేవీ తీవ్రమైనవి కావు. కోలుకొని జట్టులోకి వస్తారనే ఆశాభావంతో ఉన్నాం" అని వెల్లడించాడు.

తాజాగా కొనాటేతోపాటు మరో ఇద్దరు అనారోగ్యం బారిన పడటంతో అర్జెంటీనాతో ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు కష్టాలు తప్పవని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న అర్జెంటీనాను ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. మరీ ముఖ్యంగా మెస్సి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎంబప్పేతో కలిసి 'గోల్డెన్ బూట్' రేసులో నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటి వరకు చెరో ఐదు గోల్స్‌ చేసి ముందంజలో ఉండగా.. ఓలివీర్‌ గిరౌడ్‌ (అర్జెంటీనా) 4 గోల్స్ కొట్టాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News