వైర‌స్‌ను వ‌ద‌లని మోస‌గాళ్లు..నిధుల సేక‌ర‌ణ పేరిట భారీ మోసం

Update: 2020-07-27 01:30 GMT
చిన్న అవ‌కాశం దొరికినా చాలు మోస‌గాళ్లు త‌మ పరిజ్ఞానం చూపించి ఎంచ‌క్కా దోచేసుకుంటారు. స‌మాజం ఎలా ఉన్నా స‌రే వారి ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. తాజాగా మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాప్తిని కూడా వారు త‌మ అవ‌స‌రాల‌కు వినియోగించుకుని సంపాదించేస్తున్నారు. త‌మ జ‌ల్సాల కోసం అమాయ‌కులైన ప్ర‌జ‌ల‌ను దోచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా వైర‌స్ బాధితుల‌ పేరుతో భారీ మోసానికి పాల్ప‌డిన ఘ‌ట‌న హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో వైర‌స్ బాధితుల కోసం క్రౌడ్ ఫండింగ్ అంటూ ప్రచారం చేసి ఏకంగా కోటి రూపాయల వరకు వసూలు చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. మూడు రోజుల్లో కోటి రూపాయలు హైదరాబాద్ కు చెందిన యువకులు వసూలు చేసి భారీ మోసాన్ని పాల్ప‌డ్డ‌ట్టు వెల్ల‌డైంది. పలుచోట్ల క్రౌడ్ ఫండింగ్ మోసగాళ్లపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల క్రౌడ్ ఫండింగ్ మోసం పై కేసులు నమోదయ్యాయి. క్రౌడ్ ఫండింగ్ పేరుతో మోసాలు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు పడితే వారు ఫండింగ్ చేయమని కోరితే స్పందించవద్దని పోలీసులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు.

Tags:    

Similar News