హైదరాబాద్ లో 'అన్నపూర్ణ క్యాంటీన్ల'లో ఉచిత భోజనం .. టి సర్కార్ సంచలన నిర్ణయం !
కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉండటం తో కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించటంతో నిరుపేదలు, కూలీలు, అనాధలు అన్నానికి దూరమై పస్తులుంటున్నారు. వీరి సమస్యను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లో ఉచిత భోజన కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నపూర్ణ కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని జీహెచ్ ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. కర్ఫ్యూ , లాక్ డౌన్ వల్ల ఎవరూ ఆకలితో బాధపడవద్దన్న ఉద్దేశంతోనే మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
జీహెచ్ ఎం సి పరిధి లో ప్రస్తుతం ఉన్న 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని అన్నార్తులకు రోజు ఐదు రూపాయల భోజనాన్ని జీహెచ్ ఎం సీ కల్పిస్తోంది. తాజాగా ఈ కేంద్రాలలో ఉచితంగా భోజనం అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. నేటి నుండే ఫ్రీగా మీల్స్ అందించాలని సూచించారు. అలాగే దీనిపై మళ్లీ ఉత్తర్వులు వచ్చేవరకు ఇదే విధానం కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వర్తక వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు మూసివేయడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్రయులు, వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుత లాక్ డౌన్ లో మరిన్ని అన్నపూర్ణ కేంద్రాలను తెరచి అవసరమైన వారికందరికి అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తోంది. ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, కూలీల అడ్డాలు, జంక్షన్లు ఉన్న ప్రాంతాలలో అన్నపూర్ణ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతి భోజనంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబార్, పచ్చడి తప్పనిసరిగా ఉండే విధంగా మెనూను అమలు చేస్తున్నారు.