తెలంగాణ స్ఫూర్తితో ఢిల్లీలో ఫ్రీ భోజనం

Update: 2020-03-27 11:33 GMT
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దినసరి కూలీలు, అనాథలు, అభాగ్యులు భోజనానికి నోచుకోవడం లేదు. నిత్యం పస్తుల తో అవస్థలు ఉండడాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికి ఉచితంగా భోజనం అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 26వ తేదీ అమలు చేసింది. అనాథలు, భిక్షగాళ్లు, కూలీలతో పాటు దిక్కులేని వారికి రోజు భోజనం అందిస్తోంది. దీని స్ఫూర్తిగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉచిత భోజనం అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 28వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

కరోనా కట్టడికి అమలుచేసిన లాక్‌డౌన్‌తో దేశ రాజధాని ఢిల్లీలో 4 లక్షల మంది అభాగ్యులు నిలువ నీడలేక పోగా తిండికి నోచుకోలేకపోతున్నారు. ఈనేపథ్యంలో వారి పస్తులు గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం రోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం నుంచి 4 లక్షల మందికి ఉచితంగా భోజనం అందించనున్నారు. నైట్‌ షెల్టర్లలో తల దాచుకుంటున్న పేదలు 20 వేల మందితో పాటు మరికొందరికి కూడా భోజనం పెట్టనున్నారు. 325 పాఠశాలల్లో రెండు పూటలా భోజనం అందించనున్నారు. ఇంతకుముందే ఢిల్లీలో ఉచిత భోజనం అందిస్తుండగా తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్నార్తులు, అనాథలకు పెద్ద సంఖ్యలో భోజనం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు రెండు పూటలా భోజనం అందుతుండడంతో ఆకలి చావులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం అమలు చేయాలనే డిమాండ్‌ అధికమవుతోంది.
Tags:    

Similar News