అది ఉమ్మడి ఏపీ లో 2003-04 కాలం. అప్పటికి పదేళ్లుగా టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2002 నుంచి చంద్రబాబు పాలన లో కరువు నెలకొంది. రైతు ఆత్మహత్యలు విపరీతంగా చోటుచేసుకున్నాయి. ఇదే సమయం లో 2000లో విద్యుత్తు చార్జీల ను చంద్రబాబు ప్రభుత్వం విపరీతంగా పెంచింది. దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. అధికారం లోకి వస్తే రైతుల కు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ పాలన లో అసలు కరెంటే ఉండదని.. అలాచేస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాల్సి వస్తుందని టీడీపీ ఎద్దేవా చేసింది. కానీ, 2004 ఎన్నికల కు వచ్చేసరికి కాంగ్రెస్ ను ఉచిత విద్యుత్తు హామీనే అధికారం లోకి తెచ్చింది. అయితే, తాజాగా మళ్లీ ఉచిత విద్యుత్తు అంశం తెరపైకి వచ్చింది.
రేవంత్ ఏమన్నారు..?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడి తెలుగువారి సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రవాసులు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా పై ప్రశ్నలు అడిగారు. దీనికి స్పందిస్తూ తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదిప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరం విద్యుత్తు ఎందుకని ఆయన మాట్లాడార ని చెబుతూ బీఆర్ఎస్ మండిపడుతోంది. రేవంత్ వ్యాఖ్యల ను సొంత పార్టీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. ఇవి పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు, మంత్రులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పై విరుచుకుపడుతున్నారు.
కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల మేలు గురించి ఆలోచించదని ధ్వజమెత్తుతున్నారు. ఇక ఉచిత విద్యుత్ అంశం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే 8 గంటలు మాత్రమే విద్యుత్తు ఇస్తామని ఆయన చేసిన వ్యాఖ్యల కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో నిరసనల కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని సూచించింది. ఉచిత విద్యుత్ ను రద్దు చేయాలన్న దుర్మార్గ ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతుల ను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ దని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ఆ విధానాల ను బయటపెట్టుకుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాల ని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ లో రేవంత్ ప్రత్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పందించారు. ఆయన మాటలు వ్యక్తిగతమైనవని అన్నారు. రేవంత్ చెబితే అది అంతిమం కాదని.. తమ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుందని చెప్పారు. కాగా, కోమటిరెడ్డి స్టార్ క్యాంపెనర్. ఆ హోదాలో తాను చెబుతున్నాన ని 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు. తాను, రేవంత్ పార్టీ సమన్వకర్తలు మాత్రమేనని చెప్పిన ఆయన సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని.. మేనిఫెస్టో లో కూడా పెడతామని చెప్పారు.
రేవంత్ అప్పట్లో కాంగ్రెస్ లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్తు హామీ అమలు కు ఎంత కష్టపడ్డామో ఆయన కు తెలియదన్నారు. రేవంత్ గనుక ఉచిత విద్యుత్తు వద్దు అంటే అది తప్పేనని అన్నారు. మరోవైపు మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఉచిత విద్యుత్తు ఇస్తే ఎందకంత మంట అని నిలదీశారు.