ఆల్ ఫ్రీ అంటూ ఎన్నికల్లో గెలవడం రాజకీయ పార్టీలకు ఈజీ రూట్ గా మారింది. దాని కోసం పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. హామీలు తెచ్చి గుట్టల కొద్దీ పోయడం ద్వారా సింహాసనాన్ని అందుకుంటున్నారు.
అయితే ఆ తరువాత చేసిన హామీలను నెరవేర్చలేక కిందా మీదా అవుతున్నారు. మరో వైపు చూస్తే ఏపీ లాంటి విభజన రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో నిండా కూరుకుపోయింది. వడ్డీలు కట్టడానికి అప్పులు చేయడం పరిపాటిగా మారింది.
ఈ కీలక దశలో 2024 ఎన్నికల్లో ఉచితాలకు తెర తీస్తే కనుక ఏపీ కోలుకోలేని విధంగా దెబ్బతిని పోతుందని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఎన్నో హామీలను ఇచ్చింది. వాటిని నెరవేర్చడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
అప్పులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో రేపటి రోజున ఏపీలో అధికారంలోకి రావాలనుకుంటున్న వారు ఎవరైనా తెలివిగా చేయాల్సిన పని ఏంటి అంటే అభివృద్ధి గురించి గట్టిగా చెప్పడమే అంటున్నారు.
2024లో ఎవరైతే అభివృద్ధి అజెండాతో ముందుకు వస్తారో వారికే లాభం అని కూడా అంటున్నారు. చంద్రబాబుకు ఉమ్మడి ఏపీ సీఎం గా మంచి విజన్ ఉంది అని అంతా భావించేవారు. ఆయన కూడా డెవలప్మెంట్ ఆ రూట్ అంటూ దూకుడు చేసేవారు. ఒక విధంగా బాబు 1995లో సీఎం అయిన తరువాత తొలి నాలుగేళ్ళూ అనుసరించిన రూటే కరెక్ట్ అని కూడా ఇప్పటికీ ప్రగతి శీలురూ, మేధావులు భావిస్తారు.
నాడు మంచి ఆర్ధిక సంస్కరణవాదిగా బాబు పేరు తెచ్చుకున్నారు. ఉచితాలు అనవసరం అని కూడా ఆయన వాదించేవారు. నాడే వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే దాని వల్ల వచ్చే అనర్ధాలను కూడా ఆయన చెప్పుకుంటూ పోయారు. అలా ఉచితాలు ఇస్తూ పోతే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అని కూడా బాబు అన్న మాట ఇప్పటికీ చెప్పుకుంటారు.
అలాంటి బాబు 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత మారిపోయారు. 2009 నాటికి చాలా వాగ్దానాలు చేశారు. దాంతో ఆల్ ఫ్రీ బాబూ అంటూ వైఎస్సార్ నాడు వేళాకోళం చేశారు. ఇక 2014 నాటికి విభజన ఏపీ కోసం కూడా బాబు ఎన్నో హామీలు గుప్పించారు. అందులో కొన్ని చేశారు. కొన్ని చేయలేకపోయారు.
ఇక 2014 ఎన్నికల వేళ రైతులకు రుణ మాఫీ తాను అమలు చేయలేనని నిజాయతీగా చెప్పిన జగన్ 2019 నాటికి చాలా అలవి కానీ హామీలే ఇచ్చారని చెబుతారు. వాటిలో ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు కూడా ఒకటి.
అలాగే అనేక ఆర్ధిక భారాన్ని తెచ్చే హామీలను జగన్ ఇచ్చారు. ఇపుడు జగన్ ప్రభుత్వ పెద్దలు కరోనా వల్ల ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింది అని అంటున్నారు. నిజానికి అలా కాకపోయినా ఈ ఉచిత హామీలను నెరవేర్చడానికి ఇంతకు ఇంతా ఖర్చు అవుతూనే ఉంటుంది.
ఏపీకి ఆదాయ మార్గాలు పెద్దగా లేవు. మరో రెండు దశాబ్దాల దాకా అదుపు పొదుపు అంటూ చాల పద్దతిగా పాటిస్తేనే ఏపీ ఒక రాష్ట్రంగా నిలబడేది. అందువల్ల ఉచితాలు అంటూ రేపటి రోజున ఏ పార్టీ అయినా జనాల ముంచు వచ్చినా వాటిని ఓడించి పంపడమే విజ్ఞత కలిగిన ఓటర్ల బాధ్యత అని మేధావులు పిలుపు ఇస్తున్నారు. మరి విజన్ ఉన్న నేతలుగా ఎవరైనా ఏపీ డెవలప్మెంట్ అజెండాతో వస్తే వారికే పట్టం కట్టాలని కూడా కోరుతున్నారు.
అయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఉచితాలకు జనాలు అలవాటు పడ్డారు, వారిని అలా చేశారు. ఈ నేపధ్యంలో ఉచితాలను పోటీ పడి రాజకీయ పార్టీలు ప్రకటించకుండా ఉంటాయా. అలా చేయని పార్టీలను ఎంతవరకూ ఆదరిస్తారు అన్నది కూడా ఒక ప్రశ్న.
అయితే పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అన్నదే ఇక్కడ ప్రశ్న. అలా చేసిన వారే రేపటి ఏపీకి మార్గదర్శి అవుతారు అనడంలో సందేహం లేదు. జనాలకు కూడా ఆ విధంగా వివరించే ప్రయత్నం చేయాలి.