విప్లవ కవి వరవరరావుకు స్వేచ్ఛ.. అర్ధరాత్రి విడుదల

Update: 2021-03-07 04:05 GMT
ప్రముఖ విప్లవ కవి.. విరసం మాజీ అధ్యక్షుడు వరవరరావు బెయిల్ పై విడుదలయ్యారు. శనివారం రాత్రి 11.45 నిమిషాలకు ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.

భీమా కోరేగావ్ కేసులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నాడు. వరవరరావు వయస్సు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలంటూ మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ముంబై హైకోర్టులో పలు పిటీషన్లను దాఖలు చేశారు. వాటన్నింటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆయనకు ఆరు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.

దీనికి సంబంధించిన ప్రక్రియలు పూర్తి కావడంతో శనివారం రాత్రి వరవరరావు ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు.నానా వతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు బాంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముంబైలోనే ఉండాలని కోరింది.

ఈ క్రమంలోనే వరవరరావు హైదరాబాద్ కు రాకపోవచ్చని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆయనను కలువచ్చని తెలుస్తోంది.

భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వారికి బెయిల్ లభించడం ఇదే తొలిసారి. గత ఏడాది కాలంగా వరవరావు జైలులోనే ఉంటున్నారు.తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు నెరిపినందుకు వరవరరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. 2018 నవంబర్ లో అదుపులోకి తీసుకున్నారు. వరవరరావు వయసు 81 ఏళ్ల దృష్ట్యా కోర్టు బెయిల్ ఇచ్చింది.
Tags:    

Similar News