మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో ఒక్కసారి చూసుకుంటే షాకింగ్ గా అనిపించక మానదు. మనకంటూ సరైన భద్రత లేని పరిసరాల్లో బతకటం మనకు మాత్రమే సాధ్యమేమో. గొప్పలు చెప్పుకునే పాలకులు..పాలసీల మీద పాలసీలు చేసేయటమే కాదు.. వాటిల్లో భద్రతా పరమైన లోపాలు ఎంతగా ఉన్నాయన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. తాజాగా ట్రాయ్ చీఫ్ శర్మకు.. ఎథికల్ హ్యాకర్లు ఆధార్ లోని లోపాల్ని ఎత్తి చూపించి దిమ్మ తిరిగేలా చేయటం తెలిసిందే.
ఆధార్ నెంబర్ చెబితే చాలు.. మీ జాతకం మొత్తం చెప్పేయటమే కాదు.. మీ బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసేస్తామని సవాల్ విసరటమే కాదు.. చేతల్లో చేసి చూపించిన వైనం తెలిసిందే. తాజాగా ఫ్రెంచ్ సైబర్ నిపుణుటు ఇలియట్ ఆల్డర్సన్ ప్రధాని నరేంద్ర మోడీకి భారీ సవాల్ విసిరారు.
ప్రధాని మోడీ తన ఆధార్ నెంబర్ బయటకు ఇస్తే..ఆయన వివరాలు మొత్తంగా బయటపెట్టటమే కాదు.. ఆయన బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేస్తామని చెబుతున్నారు. ప్రధానీ.. మీ ఆధార్ నంబర్ ను బయటపెడతారా? అంటూ అతగాడు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆధార్ భద్రతమైనది.. సురక్షితమైనదని చెప్పే ప్రభుత్వానికి బాధ్యులుగా ఉన్న మోడీ.. తన ఆధార్ నెంబర్ ను తనకు బాగా అలవాటైన ట్విట్టర్ లో ట్వీట్ చేయగలరా..? ఒకవేళ చేస్తే మాత్రం ఆధార్ మీద ఎలాంటి అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.