ఓపక్క లైవ్ నడుస్తోంది. ఆ యాంకరమ్మ తన వృత్తిలో భాగంగా ఒక టెన్నిస్ ఆటగాడిని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లింది. కెమేరాకు అడ్డు లేకుండా ఉండేందుకు.. అతనికి పక్కగా వెళ్లి నిలుచుంది. ఇక్కడి వరకూ సీన్ బాగానే ఉంది. ఆ తర్వాతే ఆమెకు అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆమె ఏ మాత్రం ఊహించని రీతిలో షాకుల మీద షాకులు తగిలాయి. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? ఎవరీ పాడు పని చేశారు? అన్న విషయంలోకి వెళితే..
ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు మాక్సిమ్ హమౌ.. ప్రపంచంలో 287వ ర్యాంకు ఆటగాడు. సోమవారం మొదటి రౌండ్ మ్యాచ్ లో ఓడిపోయారు. హమౌను ఇంటర్వ్యూ చేయటానికి యూరో స్పోర్ట్ మహిళా జర్నలిస్టు సదరు ఆటగాడి వద్దకు వెళ్లింది. లైవ్ లో ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న వేళ.. తన పక్కనే నిలుచున్న జర్నలిస్టు భుజాలపై చేతులు వేశాడు హమౌ.
ఆ తర్వాత ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ముద్దాడి అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా ముద్దాడిన అతడు. ఆమెను గట్టిగా పట్టుకోవటం.. అతడ్ని వదిలించుకోవటానికి ఆమె ప్రయత్నిస్తున్నా.. ఆమెను పట్టుకొని ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. చివరకు.. ఒక చేత్తో అతడ్ని వదిలించుకోవటం కనిపిస్తుంది.
ఊహించని చేదు అనుభవంతో యూరో స్పోర్ట్ మహిళా జర్నలిస్టు మేలీ థామస్ షాక్ తింది. లైవ్ కాకుంటే.. లాగి పెట్టి ఒక్కటిచ్చే దానినని ఆమె పేర్కొంది. హమౌ అసభ్య ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నిర్వాహకులు నిషేధం విధించారు. అతడి గుర్తింపును రద్దు చేసి.. పూర్తిగా టోర్నమెంట్ నుంచి నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/