పేస్ బుక్ ప్రేమ , చెన్నై లో పెళ్లి ... యువతి అరెస్ట్ , ఎందుకంటే ?

Update: 2020-11-25 23:30 GMT
ప్రేమ గుడ్డిది అని అంటారు. అలాగే అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలతో నిజంగానే ప్రేమ గుడ్డిది అనిపిస్తుంది. ప్రేమకి వయస్సు తో , సమయంతో పనిలేదు. ఏ క్షణంలో , ఎవరిపై ప్రేమ ఎందుకు పుడుతుందో కూడా తెలియదు. అలాగే ప్రేమకి దూరం తో పనిలేదు కేవలం మనసుతో పని అంటారు కదా దాన్ని నిజం చేస్తూ ఓ జంట పేస్ బుక్ లో ప్రేమించుకొని , చెన్నై కి వచ్చి ప్రేమించిన వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకున్న ఓ బాంగ్లాదేశ్ యువతిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమకి దురంతో పనిలేకపోయినా , అక్రమంగా భారత్ లోకి ప్రవేశించినందుకు ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... పశ్చిమ బెంగాల్ లో నివసించే శశిషేక్ అనే యువకుడికి పేస్ బుక్ ద్వారా బంగ్లాదేశ్ కు చెందిన పాపియోఖోష్ అనే యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కొన్నిరోజులకి ప్రేమగా మారింది. ఈ ప్రేమవ్యవహారం తో పాపియో ఖోష్ పాస్ పోర్టు లేకుండా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వచ్చి ప్రేమించిన వాడిని కలుసుకుంది. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి తమిళనాడు చేరుకున్నారు. నవంబర్ 12న కోవై జిల్లా పొల్లాచ్చిలో రిజిష్టర్ మ్యారేజి చేసుకున్నారు. చెన్నైలోని మింజూరులోకాపురం పెట్టి నివసిస్తున్నారు.

ఈ మధ్యలో తన కుమార్తె కనిపించటంలేదని ఖోష్ తండ్రి బంగ్లాదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు భారత పోలీసుల సహకారంతో యువతి మింజూరులో ఉన్నట్లు కనుగొన్నారు.ఈ విషయాన్ని సీబీబీఐడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాంచీపురం పోలీసులు పాపియోఖోష్ ను అదుపులోకి తీసుకుని మీంజూరు పోలీసులకు అప్పగించారు. పాస్ పోర్టు లేకుండా భారత్ లోకి ప్రవేశించిన కారణంగా యువతిని పొన్నేరి కోర్టులో హజరు పరిచి జైలుకు తీసుకువెళ్లారు.
Tags:    

Similar News