దేశాలన్నిటినీ రెండేళ్ల పాటు గడగడలాడించింది.. 42 కోట్ల మందికి సోకింది.. అనధికారిక గణాంకాలనూ కలుపుకొంటే కోటి ప్రాణాలను బలిగొంది.. ఇప్పటికీ రోజుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కేసులొస్తూనే ఉన్నాయి... ఇదంతా కొవిడ్ గురించే అని ఎవరికీ చెప్పనక్కర్లేదనుకుంటా..? అసలు ఆ పేరు తలుచుకుంటేనే ఉలికిపాటుతో పాటు వెన్నులో వణుకు పుడుతోంది. రెండు నెలల క్రితం
వచ్చిన ఒమైక్రాన్ ఎంతటి కలకలం రేపిందో అందరూ చూశారు కదా? అయితే, అలాంటి కొవిడ్ గురించి ప్రఖ్యాత లాన్సెట్ జనరల్ మంచి కబురు చెప్పింది. లాన్సెట్ అంటే సైన్స్ జనరల్స్ కు పెద్దన్న. అలాంటి దాంట్లో కథనం వచ్చిందంటే అది ఎంతైనా నమ్మదగ్గదే. ఇంతకూ లాన్సెట్ చెప్పినదేమంటే.. కొవిడ్ ఇప్పుడు ఎండెమిక్ దశకు చేరిందని..? అంటోంది. అంటే ‘ఏదో ఒక ప్రాంతానికి పరిమితమై’..దాని వ్యాప్తి పరిస్థితులు అనుకూలించినప్పడు మాత్రమే వెలుగుచూసే దశ అన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది.. కొవిడ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) ‘‘పాండెమిక్’’ గా ప్రకటించింది. పాండెమిక్ అంటే ‘‘మహమ్మారి’’ అని తెలుగు అర్థం. అసలు పాండెమిక్ ఏమిటి? ఎండెమిక్ ఏమిటి? మధ్యలో ఎపిడెమిక్ ఏమిటి? తెలుసుకుందాం..
పాండెమిక్..
ఒకచోట వ్యాప్తి మొదలై.. దాని తీవ్రత అధికంగా ఉండి.. విపరీతంగా వ్యాప్తి చెందే అంటే అందరికీ అంటుకునే గుణ ఉండి.. హాని కలుగుజేసే దానిని పాండెమిక్ అంటారు. కరోనా చైనాలోని వూహాన్ లో పుట్టి.. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. ఒకరి నుంచి ఒకరికి సులువుగానే సోకింది. కాబట్టే దీనిని పాండెమిక్ గా ప్రకంటించింది డబ్ల్యూహెచ్ వో. అయితే, వూహాన్ లో వైరస్ వ్యాప్తిని ముందుగానే గుర్తించడంలో సంస్థ విఫలమైందని, చైనా తొత్తులా వ్యవహరించిందని, ఇప్పటికీ ఇలానే ఉందని, కొవిడ్ గురించి ప్రపంచాన్ని ముందుగానే అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యం చూపిందని దీనిపై ఎన్నో విమర్శలున్నాయి. ఏదేమైనా ఒక వ్యాధిని మహమ్మారి గా ప్రకంటించడం చాలా అరుదు. కాబట్టే కొవిడ్ ను పాండెమిక్ గా నిర్ధారించినప్పడు దేశాలు అప్రమత్తం అయ్యాయి. మన భారత దేశం కూడా ఎన్నడూ లేని విధంగా కరోనాను ‘‘జాతీయ విపత్తు’’ అని ప్రకంటించడం దీనికి నిదర్శనం.
ఎపిడెమిక్ అంటే..
పాండెమిక్ గా ప్రకటించిన వ్యాధి వ్యాప్తి చెందుతూ.. పోతుంటే దానిని ఎపిడెమిక్ దశ అంటారు. ఇది ఎంతకాలమైనా కొనసాగవచ్చు. ఉదాహరణకు కొవిడ్ కు సంబంధించి ఈ రెండేళ్లలో అనేక వేవ్ లు వచ్చాయి. గుర్తించదగిన కొత్త వేరియంట్లు ఓ పది అయినా వచ్చాయి. వీటిలో డెల్టా వంటి అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు లక్షలాది ప్రాణాలను బలిగొంటే.. ఒమైక్రాన్ వంటిది లక్షలాది కేసులకు
కారణమైంది. డెల్టా నేరుగా మనిషి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. అందుకే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉండి ప్రాణాలు పోయాయి. ఒమైక్రాన్ మాత్రం వ్యాప్తిలోనే వేగంగా ఉండి. ముక్కులోనే ఉండిపోయింది. ఊపిరితిత్తుల్లోకి జారలేదు. దీంతో మరణాలు చాలా తక్కువగా సంభవించాయి. ఒకవేళ ఒమైక్రాన్ కు గనుక డెల్టా అంతటి తీవ్రత ఉన్నా.. డెల్టాకు ఒమైక్రాన్ అంతటి వ్యాప్తి వేగం ఉన్నా ప్రపంచం పరిస్థితి ఇప్పుడు వేరేగా ఉండేది. డెల్టా భారత్ లో పుట్టగా, ఒమైక్రాన్ దక్షిణాఫ్రికాలో పుట్టింది. అయితే దీనికిముందు డెల్టా ప్లస్ కూడా దక్షిణాఫ్రికాలోనే జన్మించింది. ఈ వేరియంట్ చాలా ప్రమాదకారి అని నిపుణులు హెచ్చరించారు. కాకపోతే, దీనికి అసలు వ్యాప్తి వేగం లేదు. కాబట్టి త్వరగానే సమసిపోయింది. మరోవైపు కరోనా కుటుంబంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి లెక్కలేనన్ని వేరియంట్లు పుడుతూనే ఉంటాయి. అయితే, 99 శాతం మనకు తెలియకుండానే పోతుంటాయి. ఆ మిగిలిన ఒక్కశాతమే వూహాన్ స్ట్రెయిన్ అయినా.. డెల్టా అయినా.. ఒమైక్రాన్ అయినా..? ఇలా పాండెమిక్ కొనసాగుతూ పోయే కాలాన్నే ‘‘ఎపిడెమిక్’’ అంటారు. ముందే చెప్పుకున్నట్లు ఈ దశ రెండోది. దీనికోసమే మనదేశ ఆరోగ్య శాఖలో ఎపిడెమిక్ సెల్ లు ఉంటాయి. ఇలాంటి వ్యాధుల
పై అధ్యయనం చేసేవారిని ఎపిడెమియాలజిస్టులు అంటారు.
ఎండెమిక్..
ప్రపంచంలోని అత్యధికులు పాండెమిక్ (కొవిడ్) బారినపడి, తద్వారా సామూహిక ఇమ్యూనిటీ సాధించడం ద్వారా కానీ, లేదా టీకా కారణంగా కానీ రోగ నిరోధకతను పొంది.. మహమ్మారి ప్రభావం తగ్గే దశనను ఎండెమిక్ అంటారు. అంతేకాక, ఆ మహమ్మారి తన శక్తిని కోల్పోయిన దశగానూ దీనిని చెప్పుకోవచ్చు అయితే, పేరులో ఎండ్ అని ఉన్నందున ఎండెమిక్ దశతోతో మహమ్మారి పనై పోయిందని భావించే పరిస్థితి లేదు. కాకపోతే, అప్పటికీ ఏదో ఒక ప్రదేశంలో ఉంటూ .. ఈ పరిమిత ప్రదేశంలోనే ప్రభావం కలిగించే స్థితి ఇది. కానీ, డెల్టా వంటి అత్యంత ప్రమాదకర వేరియంట్లు వస్తే ఆ పరిమిత ప్రాంతంలోనే పెద్ద నష్టం జరుగవచ్చు. మొత్తమ్మీద ‘‘ఎండెమిక్’’కు ఇటీవలి ప్రత్యక్ష ఉదాహరణ.. ఎయిడ్స్. ఇది ఎప్పుడో ఎండెమిక్ దశకు చేరింది. ఒకప్పడు ప్రపంచాన్ని గడగడలాడించి.. 20 ఏళ్ల కిందటే పులి రాజాగా పేరుగాంచిన ఎయిడ్స్ దానంతటదే వ్యాపించే స్థితిలో లేక బలహీనపడింది.
కనుమరుగై పోలేదు..
కొవిడ్ ఎండెమిక్ దశకు చేరినంత మాత్రాన కనుమరుగు అయినట్లు కాదనేది నిపుణుల మాట. ఇప్పడు లాన్సెట్ సైతం అదే చెబుతోంది. కొవిడ్ కారణంగా ఈ రెండేళ్ల కాలంలో మిగిలిన సాంక్రమిక వ్యాధుల పరిశోధన తగ్గిందని.. ఇకపై వాటి గురించి చూడాలని కోరుతోంది. ‘‘ఒమిక్రాన్ రకంతో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేవ్‌ను సృష్టించిన కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా దాదాపు తగ్గుముఖం పట్టిండి. మహమ్మారి దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు కొన్ని అధికారిక వ్యవస్థలు ప్రకటించాయి. జనవరి చివరి వారంలోనే 2.2 కోట్ల కేసులు, 59వేల మరణాలు నమోదయిన విషయాన్ని మరిచిపోకూడదు. ఇక్కడ శుభవార్త ఏమంటే- విస్తృత స్థాయిలో టీకాల కార్యక్రమం జరిగిన
దేశాల్లో కేసులు, మరణాల మధ్య తేడా కనిపించింది. అయితే ఆ లంకె పూర్తిగా తెగిపోలేదు. కొవిడ్-19 ఎండెమిక్‌గా మారినప్పటికీ అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇది ఎండెమిక్‌గా మారినంత మాత్రాన తేలికైపోయిందనుకోవడానికి వీల్లేదు. ఎక్కువమంది జనాభా దీన్ని
ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుకున్నారన్న సంకేతాలు ఉన్నాయి. రోగి తీవ్రత, వారి అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని చూస్తే దీని తీవ్రత సీజనల్ ఇన్‌ఫ్లుయెంజాకు దగ్గరగా ఉంటుంది’’ అని లాన్సెట్ తెలిపింది.