పెట్రోల్ లేక విమానాలు ర‌ద్దు !!

Update: 2015-11-11 12:24 GMT
అవును మీరు చ‌దివింది నిజ‌మే. విమానాల్లో ఉప‌యోగించే ఏవియేష‌న్ ట‌ర్బైన్ ఫ్యూయ‌ల్, జెట్ ఫ్యుయ‌ల్ లేక విమానా ప్ర‌యాణాలు నిలిచిపోయాయి. ఇది చ‌దివింది మ‌న పొరుగుదేశం నేపాల్‌లో. అవును నేపాల్ మ‌త‌ప‌ర‌మైన దేశం నుంచి లౌకిక దేశంగా ఇటీవ‌లే మారింది. దీన్ని నిర‌సిస్తూ స్థానిక పౌరులు ఆందోళ‌న చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో నేపాల్‌లోని మదేశీలు, ఇతర కమ్యూనిటీలు సాగిస్తున్న నిరసనల వల్ల నేపాల్‌లో ఇంధన కొరత తలెత్తింది. దీనివ‌ల్ల దేశీయ విమానాలను సగానికిపైగా రద్దు చేయాల్సి వచ్చింది. ఆదివారం 70శాతం దేశీయ విమానాలను రద్దు చేసినట్లు ఖాట్మండు ఎయిర్ పోర్ట్‌ మేనేజర్‌ తెలిపారు. మంగళవారం 50శాతం విమానాలను రద్దు చేశారు. కాగా అంతర్జాతీయ విమానాలు మాత్రం సాధారణ షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తున్నాయి. అయితే నేపాల్‌కు రావడానికి ముందుగానే ఆ విమానాలు వాటి ట్యాంక్‌లను పూర్తిగా నింపుకుని రావాల్సివస్తోంది.

దేశీయ విమనాలను ఇలా రద్దు చేస్తూ వుండడంతో ఖాట్మండులో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నేపాల్‌ నూతన రాజ్యాంగాన్ని నిరసిస్తూ మాదేశీలు కొనసాగిస్తున్న నిరసనలు గత కొన్ని వారాలుగా సాగుతునే వున్నాయి. భారత్‌తో గల దక్షిణ సరిహద్దును వీరు దిగ్బంధించడంతో ఇంధనం, ఇతర నిత్యావసరాలు నేపాల్‌లోకి రాకుండా నిలిచిపోయాయి.
Tags:    

Similar News