ఎయిర్ పోర్ట్ లో స్కానర్లు.. కొత్త డౌట్లు!

Update: 2017-01-18 09:47 GMT
ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక టెర్మినల్ వద్ద ప్రయోగాత్మకంగా ఒక స్కానర్ ను ఏర్పాటు చేశారు. టెర్రరిస్టు ముప్పును ఎదుర్కొనేందుకు ఈ బాడీ స్కానర్లు అని చెబుతున్నారు. అయితే ఈ స్కానర్లు ఎక్స్ రే ఆధారితమైనవా, లేక రేడియో ఫ్రీక్వెన్సీ తో పనిచేస్తూ అత్యధిక రేడియేషన్ ను కలిగిస్తూ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చేవా అనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కొంతమంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో.. టెర్రరిస్టు ముప్పును ఎదుర్కొనేందుకు ఎయిర్ పోర్టుల్లో బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వివాదాస్పదమవుతుంది. శరీరమంతా స్కాన్ చేసే ఈ రకం స్కానర్లను నేకెడ్ స్కానర్స్ అని కూడా పిలుస్తుంటారు. ఉగ్రవాదుల ముప్పును కనుక్కోవాలంటే తమకు ఈ విధమైన స్కానర్లు అవసరమని ఇప్పటికే హైదరాబాద్ లోని సి.ఐ.ఎస్.ఎఫ్., జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు కూడా కోరుతున్నారు.

అయితే తాజా ఆందోళనపై ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు స్పందిస్తున్నారు. ఇది పూర్తిగా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో నిర్ణయమని వారు స్పష్టం చేస్తున్నారు. యూఎస్ లో బాడీ స్కానర్లు ఎక్స్ రే ఇమేజ్లను తీస్తాయని.. కానీ ఢిల్లీలోని స్కానర్లు కేవలం ఊహాచిత్రాల్లాంటి ఇమేజ్ లు మాత్రమే తీస్తాయికనుక ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే ఈ క్లారిటీపై సంతృప్తి చెందని ప్రయాణికులు మాత్రం ఈ స్కానర్స్ పై మరింత క్లారిటీ అవసరమని కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News