మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెబితే పెడచెవిన పెడతారు. మద్యం తాగితే తాగారు. కానీ అదే మద్యంతో ఆటలాడితే ప్రాణం మీదకు వస్తదనే విషయం తెలియదు. తాగిన మైకంలోనే పౌరుషాలు.. మగాడు.. హీరోగా ఫీలయి సాహసాలకు సై అంటారు. అది కాస్త వికటించి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుఊ. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగింది.
నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండలం చింతలచందాకు చెందిన ఖాజా రసూల్ తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. అతడికి భార్య.. ఓ కొడుకు ఉన్నారు. తన మిత్రులు షేక్ ఖాజా.. రత్తయ్య, నాగూర్ బాషాతో పాటు మరొక వ్యక్తి మొత్తం ఐదుగురు మామడ మండలం అనంతపేటలో విందు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ ఫుల్లుగా మందు తాగారు. అంతా మద్యంమత్తులో తూలుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు మద్యం తాగడంపై పందెం కాశారు.
ఈ సందర్భంగా ఫుల్ బాటిల్ మద్యం 20 నివిుషాల్లో తాగితే రూ.20 వేలు ఇస్తామని ఇద్దరు మిత్రులు షేక్ ఖాజా రసూల్‌తో పందెం కాశారు. పందానికి రసూల్ అంగీకరించి ఫుల్‌బాటిల్ తాగడం మొదలుపెట్టాడు. సగం బాటిల్ తాగాక అకస్మాత్తుగా రసూల్ కిందపడ్డాడు. దీంతో స్నేహితులు కంగారు పడ్డారు. వెంటనే అంబులెన్స్ లో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతిగా మద్యం తాగేలా రెచ్చగొట్టి రసూల్ మరణానికి కారకులైన రత్తయ్య, నాగూర్ బాషాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.