అక్కడ ఇండియన్ ఫుడ్‌కు ఫుల్ డిమాండ్

Update: 2021-10-04 08:32 GMT
మన దేశ భోజనం అంటే మన దేశం వాళ్లే కాదు... విదేశీయులు కూడా ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు. అయితే, వారి దేశ వంటకాలను వారు ప్రతీ రోజు ఆస్వాదిస్తుంటారు. మనం ఎలాగైతే మన దేశ ఆహార పదార్థాలను ఇష్టపడుతామో.. వారు వారి దేశ ఫుడ్‌ను తీసుకుంటుంటారు. అయితే, లండన్‌లో మాత్రం భారతీయ భోజనానికి రోజురోజుకూ డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఎందుకు అలా జరుగుతుందో తెలియాలంటే మీరు ఈ స్టోరి చదవాల్సిందే.

లండన్‌లో ఉండే ఓ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇండియా’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఉండటంతో పాటు ప్రదేశాన్ని చూస్తే ఇండియాలో ఉన్న ఫీలే కలుగుతుందట. లండన్‌లోని డ్రమ్మండ్ స్ట్రీట్‌ను లిటిల్ ఇండియా అని పిలుస్తుంటారు. సెంట్రల్ లండన్‌లో ఈ ప్రదేశం ఉంటుంది. ఈ ప్రాంతంలో దక్షిణ ఆసియాకు చెందిన అనేక రెస్టారెంట్స్ ఉంటాయి. అయితే, ఇక్కడ భారతీయులు ఇష్టంగా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మసాల దోశలు, మంసం కబాబ్, ముంబైకి చెందిన ఫుడ్ ఐటమ్స్ అన్ని లభిస్తాయి. ఇకపోతే భారతీయులు అత్యంత ఇష్టంగా తినే పచ్చళ్లు, మసాలాలు, తిను బండారాలు, స్వీట్స్ కూడా లభిస్తాయి. ఇక్కడ ఉండే రెస్టారెంట్స్‌లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్ అత్యంత టేస్టీగా ఉంటుందని స్థానికులు చెప్తుంటారు.
 
ఇలా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఉంది. 20వ శతాబ్దం మధ్య కాలంలో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వలస వచ్చారు. ఆనాటి యుద్ధం సమయంలో బ్రిటన్ కోసం సైనికులు అవసరం కాగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి చాలా మంది ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చారు. యుద్ధంలో పాల్గొనడానికి మాత్రమే కాదు చదువకోవడానికి వచ్చి ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోయారు. ఇక 1960, 70లలో గుజరాత్, పంజాబ్ నుంచి చాలా మంది ఈ ప్రాంతానికి వలస వచ్చారు. అలా ఈ ప్రాంతానికి వచ్చి చాలా మంది ఇక్కడే ఉండిపోయారు.

ఈ డ్రమ్మంట్ స్ట్రీట్‌లో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. వీటిని చూస్తే బంగ్లాదేశీ ఫీల్ వస్తుంది. ఈ ప్రాంతంలోని ఈ బంగ్లాదేశీ రెస్టారెంట్స్‌లో ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ కూడా లభించడం విశేషం. బంగ్లాదేశీ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని ‘బంగ్లా టౌన్’ అని పిలుస్తారు. ఈ రెస్టారెంట్స్ లండన్ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉండటం డ్రమ్మంట్ స్ట్రీట్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు.

ఇక డ్రమ్మంట్ స్ట్రీట్ మాదిరిగానే లండన్‌లోని ప్రతీ ప్రాంతంలో ఇటువంటి వీధులు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఇందులో భారతీయ తినుబండారాలు లభించడం స్పెషాలిటీ అని స్థానికులు పేర్కొంటారు. మొత్తంగా ఆనాడు లండన్‌కు వలస వచ్చిన భారతీయులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఇది ‘మినీ ఇండియా’ లేదా ‘లిటిల్ ఇండియా’గా మారిందని స్థానికులు అంటున్నారు. డ్రమ్మంట్ స్ట్రీట్‌లో అన్ని రకాల భారతీయ వంటకాలతో కూడిన ఫుడ్ లభిస్తుంది. డమ్మంట్ స్ట్రీట్‌లో భారతీయ చాట్ బండార్, మురీ మిక్చర్, లాడేభేల్ పూరీ, ఆలూ చాట్ వెరీ స్పెషల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఇండియన్స్ మాత్రమే కాదు విదేశీయులు కూడా వీటిని ఇష్టంగా తింటారని రెస్టారెంట్స్ నిర్వాహకులు చెప్తున్నారు.
Tags:    

Similar News