కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న కేంద్రం... తీరా బడ్జెట్టు కేటాయింపుల్లో రిక్త హస్తం చూపించింది. కనీసం విభజన చట్టంలో వున్న హామీలను సైతం పక్కనబెట్టేసింది. దాంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే... కొత్త రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర బడ్జెట్టు కేటాయింపులు చేసింది. అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లను కేటాయించింది. అంతేకాదు... కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు సైతం భారీ నిధులను బడ్జెట్టులో పెట్టింది. సుమారు రూ.3660 కోట్ల రూపాయలను కేటాయించింది. అంటే మొదట రాష్ట్ర ప్రభుత్వమే నిధులను పోలవరానికి ఖర్చు చేసేసి... ఆ తరువాత కేంద్రం నుంచి విడతల వారిగా రాబట్టుకోవచ్చనే ఆలోచనలో ఇలా చేసుండొచ్చని తెలుస్తోంది.
అలాగే రాజధాని నిర్మాణం అంతా సింగపూర్ కంపెనీలకు అప్పజెప్పనున్నారనే వార్తలు గతంలో విపరీతంగా ప్రచారం అయ్యాయి. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీలు రాజధాని నిర్మాణానికి అంగీకారం తెలిపినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ విధానం సరైంది కాదని చాలా మంది నిపుణుల హెచ్చరికలు ఓ వైపు... సింగపూర్ కంపెనీల గొంతెమ్మలు కోరికలు మరోవైపు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడంతో... ఇక రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని భావిస్తున్నట్టు తాజా ఆర్థిక కేటాయింపులను చూస్తే అర్థం అవుతోంది. ఎట్టకేలకు చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ విధానంలో కాస్త వెనకడుగు వేసినట్టేనని నిఫుణులు చెబుతున్నారు.
అలాగే రహదారుల అభివృద్దికి కూడా సుమారు రూ.3184 కోట్ల రూపాయలను రాష్ట్రం కేటాయించింది. కొత్త రాజధాని అమరావతిని కలిపే అన్ని రహదారులను ఈ నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గతంలో కేంద్ర రహదారులకోసం వేల కోట్లను కేటాయించనున్నట్టు కేంద్ర మంత్రి గట్కారి చెప్పారు. అయితే ఆ మేరకు మొన్న ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్టులో కేటాయించలేదు. దాంతో రాష్ట్రమే రహదారులను కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టుంది. ఏది ఏమైనా... కొత్త రాష్ట్రం... కొత్త రాజధాని అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఇక కేంద్రంపైన గానీ... సింగపూర్ కంపెనీలపైన గానీ ఆధారపడకుండా.. అన్నీ తానై వ్యవహరించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.