కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా చావేమోనన్న భయంతో జనం అటువైపు కూడా చూడటంలేదు. కనీసం సొంత వాళ్లు చనిపోయినా..ఆసుపత్రిలోనే వదిలేస్తున్నారు. కరోనాతో చనిపోలేదు..తీసుకపోవాలని చెబుతున్నా..పట్టించుకోవడం లేదు. తాజాగా రాజస్థాన్ లో మాతృదినోత్సవం రోజే ఓ తల్లికి కన్న కొడుకులు ఇద్దరూ కలిసి తోపుడు బండిలో అంతిమయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు చేశారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ... రాజస్థాన్‌లోని నావల్ పురా చౌక్ కు చెందిన దినేష్ కుమార్ తల్లికి ఇటీవల కరోనా సోకడంతో అక్కడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ చేశారు. అయితే శనివారం ఆమె అస్పత్రిలో వద్దంటూ ఇంటికి తీసుకెళ్లమని తన ఇద్దరి కొడుకులను కోరింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లగా, అక్కడ శనివారం ఆమె కన్నుమూసింది. తన తల్లి మృతదేహాన్ని శశ్మానవాటికి తీసుకెళ్లడానికి ఆంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను, పోలీసులను కోరగా వారు స్పందించలేదు. మరోవైపు కరోనా మరణం అని తెలిసే సరికి అక్కడి గ్రామస్తుల్లో ఏ ఒక్కరూ కూడా దగ్గరికి కూడా రాలేదు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకులిద్దరే ఓ తోపుడు బండిపై తల్లి శవాన్ని పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. అది కూడా మాతృదినోత్సవం రోజే జరగడం నిజంగా విచారకరం. దేశంలో ప్రజలు కరోనా ను అరికడదాం అని ఎంత చెప్పినా నియమాలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కానీ, కరోనాతో మరణించిన వారి విషయంలో మాత్రం దగ్గరకు రాకూడదనే నిబంధనలను మాత్రం ఓ ఒక్కరూ కూడా బేఖాతరు చేయడం లేదు. ఇదే ప్రస్తుతం సమాజంలో ఉన్న మానవత్వం.