బ్రిటన్ చరిత్రలోనే సుధీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్2 కన్నుమూశారు. స్కాట్లాండ్ లోని బల్మోరల్ క్యాజిల్ లో ఆమె ఈనెల 8న తుది శ్వాస విడిచారు. రాజ కుటుంబ సంప్రదాయంలో బ్రిటన్ లో ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
లండన్ కు తీసుకొచ్చిన తర్వాత ఆమె శవపేటికను వెస్ట్ మినిస్టర్ హాల్లో నాలుగు రోజుల పాటు ఉంచారు. తాజాగా బ్రిటన్ రాణి ఎలిజిబెత్2 అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా పూర్తి చేశారు.
రాణి భౌతికకాయం ఉన్న వెస్ట్ మినిస్టర్ అబెలో కుటుంబ సభ్యులు సోమవారం తుది ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ జనసందోహం మధ్య ఆమె శవపేటికను విండ్ సోర్ కాస్టిల్ కు తరలించారు. అక్కడే ఖననం చేశారు. అంత్యక్రియల సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా నివాళులు అర్పించారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా ప్రపంచదేశాల అధినేతలు కలిపి మొత్తం 2000 మంది విదేశీ ప్రతినిధులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. భారత్ తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లండన్ లోని 125 థియేటర్లో రాణి అంత్యక్రియలను లైవ్ ప్రదర్శన చేశారు. చివరగా రాయల్ వాల్డ్ లో రాణి శవపేటికను ఉంచుతారు.
మధ్యయుగం నాటి కలపతో 11వ శతాబ్ధంలో నిర్మించిన ఈ హాల్ లో 'క్యాటఫాక్'గా పిలిచే వేదికపై రాణి శవపేటికను ఉంచుతారు. రాజ కుటుంబానికి భద్రత కల్పించే సైనికులే ఈ శవ పేటిక చుట్టూ రక్షణగా ఉంటారు. బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి అంతిమ యాత్రగా రాణి శవపేటికను తీసుకెళ్తారు. ఆమె వెంట రాజ కుటుంబ సభ్యులు వస్తారు. సైనిక కవాతు కూడా ఉంటుంది. వీధుల గుండా అంతిమయాత్ర కదిలేటప్పుడు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు లండన్ రాయల్ పార్క్ లలో కార్యక్రమాన్ని బ్రాడ్ కాస్ట్ చేసేందుకు పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తారు.
వెస్ట్ మినిస్టర్ అబేలో రాణి అంత్యక్రియలు నిర్వహించారు. అబే అనేది ఒక చారిత్రక ప్రాధాన్యమున్న చర్చి. బ్రిటన్ రాజులు, రాణులు ఇక్కడే పట్టాభిషిక్తులు అవుతారు. ఎలిజబెత్ 2 కూడా 1953లో ఇక్కడే రాణిగా మారారు.
మరోవైపు ప్రిన్స్ ఫిలిప్ తో 1947లో ఆమె పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. 18వ శతాబ్ధం తర్వాత అబేలో ఒక్క రాజ కుటుంబ అంత్యక్రియలు కూడా జరగలేదు. 2002లో రాణి తల్లి అంత్యక్రియలను కూడా చేపట్టలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.