అందాల కశ్మీర్ లో పరిణామాలు మారుతున్నాయి. హత్యలతో అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. వరుసగా జరుగుతున్న దారుణలతో ప్రజలు భీతిల్లుతున్నారు. మొన్న టీవీ నటి, నిన్నప్రభుత్వ టీచర్, ఆ రోజు బ్యాంక్ మేనేజర్ ను ఉగ్ర వాదులు కాల్చి చంపారు. టీచర్బాలా హత్యపై స్పందిస్తూ 'ఇక అందరినీ చంపేస్తారు' అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లే పరిస్థితులు ఆందోళనకరంగా తయారవుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో గురువారం బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. సామాన్య పౌరులు, మైనార్టీలపై దారుణాలు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
బ్యాంక్ లోకి చొరబడి..రాజస్థాన్ హనుమాన్‌నగర్ కు చెందిన విజయ్.. కుల్గామ్‌లోని అరే మోహన్‌పొరా ప్రాంతంలోని ఎల్లాఖీ దేహతి బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గురువారం బ్యాంక్ లోకి చొరబడిన కొందరు ఉగ్రవాదులు ఆయనపై పై కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మేనేజర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ నెలలో ఉగ్రవాదులో చేతిలో బలైన మూడో ముస్లిమేతర ప్రభుత్వ ఉద్యోగి ఈయన.
మూడు రోజుల్లో రెండో ఘటన కశ్మీర్‌లో మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం మూడు రోజుల్లో ఇది రెండో సారి. కుల్గామ్ జిల్లాలోని గోపాల్‌పొర ప్రాంతంలోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఉగ్రవాదులు రజిని బాలా అనే ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. గత వారం టీవీ నటి అమ్రీన్ భట్‌ను హత్య చేశారు. దీంతో మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లో ఎనిమిది హత్యలు జరిగాయి. ఇందులో ముగ్గురు విధుల్లోని పోలీసులు, ఐదుగురు పౌరులు.
టీచర్ పై విచక్షణారహితంగా పరిస్థితులు చూస్తుంటే ఉగ్రవాదులు కావాలనే ఇదంతా చేస్తున్నట్ల స్పష్టంగా కనిపిస్తోంది. రజనీ బాలా ప్రభుత్వ బడిలో విధులు నిర్వరిస్తుండగా.. ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈమె పండిట్. ఇంతకుముందు రాహుల్ భట్ అనే కశ్మీరీ పం డిట్‌ను ముష్కరులు హత్య చేశారు. రజినీ హత్యపై ఖండనలు వెల్లువెత్తాయి. నిరాయుధులైన పౌరులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. రజినీ ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు. "కశ్మీర్‌లో సాధారణ వాతావర ణం ఉందని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. అలాంటి వాతావరణం ఉంటే ఉగ్రవాదులు ఎలా రెచ్చిపోతున్నారు?"అని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రశ్నించారు. అలాగే రజినీ హత్యకు వ్యతిరేకంగా కశ్మీరీ పండిట్లు భారీఎత్తున ర్యాలీలు నిర్వహించారు.
పండిట్లకు పీఎం ప్యాకేజీ కింద ఉద్యోగాలు బాలా హత్య అనంతరం పండిట్లు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేశారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్, సోన్వారా ప్రాంతాల్లో ఈ ప్రదర్శన లు జరిగాయి. తమకు ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించాలని లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పండిట్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద వీరంతా ఉద్యోగాలు పొందారు. అయితే, పండిట్లను మరిన్ని బెదిరింపులు, ఆందోళనకు గురిచేస్తూ ఓ ఉగ్ర సంస్థ హెచ్చరిక లేఖను జారీ చేసింది. "ప్రభుత్వంతో చేతులు కలిపి తొత్తులుగా మారొద్దు. వలసవాద ఫాసిస్టు పాలనకు ఎవరైనా తొత్తులుగా మారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రతిఘటన పోరాటాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా విశ్వరూపం చూస్తారు. జమ్మూకశ్మీర్ వివాదాస్పద ప్రాంతం కాదు. క్రూర, మోసపూరిత, వలసవాద ఫాసిస్టు, విదేశీ కిరాయిదార్లు ఆక్రమించుకున్న ప్రాంతం. ప్రభుత్వ పునరావాస కార్యక్రమంలో ఎవరైనా భాగస్వాములైతే వారిని ఆక్రమణదారుగా పరిగణిస్తాం" అని ముష్కరులు హెచ్చరించారు.దీంతో పండిట్లు ప్రతి క్షణం భయంభయంగా గడుపుతున్నారు. లష్కరే తాయిబాకు చెందిన రెసిస్టాన్స్ ఫ్రంట్, లష్కరే ఇస్లామీ ఉగ్ర సంస్థలు కూడా ఇటీవలే పండిట్లను బెదిరించిన విషయం తెలిసిందే."లోయను వదిలివెళ్లాలి.లేదా చావడానికి సిద్ధంగా ఉండాలి"అని హెచ్చరిక ప్రకటన జారీచేశాయి.
కేంద్రం ఏం చేస్తుందో..?కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370 ని రద్దు చేసి మూడేళ్లు కావొస్తోంది. దీనిని ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటోంది. కశ్మీర్ కు వేల కోట్ల నిధులు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోంది. అయితే, తాజా ఘటనలు కేంద్రాన్ని ఇరుకున పెట్టేవే. అందులోనూ పండిట్ల హత్యలు.. కాషాయ పార్టీని నిలదీసే పరిస్థితులు తెస్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.