విద్యార్ధుల భవిష్యత్తు నాశనమేనా ?

Update: 2022-10-23 04:10 GMT
తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న ఒక తలతిక్క నిర్ణయంతో పిల్లల భవిష్యత్తు గాలిలో ఊగుతోంది. హైదరాబాద్ లోనే ఉండే ఒక ప్రైవేటు స్కూల్లో ఒక చిన్నారిపై లైగింక దాడి జరిగింది. దాంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్టయ్యింది. ఎంత సీరియస్ అంటే లైగింకదాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవటమే కాకుండా ఏకంగా స్కూలుగుర్తింపునే రద్దుచేసేంతగా రియాక్టయ్యింది. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవటం వరకు ఓకేనే. కానీ స్కూలు గుర్తింపు రద్దుచేయటం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోగలిగితేనే అది మిగిలిన స్కూళ్ళకు గుణపాఠంగా ఉంటుంది. కానీ స్కూలు గుర్తింపును రద్దుచేయాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే స్కూలు గుర్తింపు రద్దయితే వెంటనే స్కూలును మూసేయాల్సుంటంది. అదే జరిగితే స్కూల్లో చదువుతున్న సుమారు వెయ్యిమంది విద్యార్ధుల భవిష్యత్తు ఏమవ్వాలి ? ఇంతమందిని వేరే స్కూళ్ళల్లో సర్దుబాటుచేయటం కూడా కష్టమే. పైగా విద్యాసంవత్సరం చివరకు వచ్చేస్తోంది.

మరో నాలుగు మాసాల్లో  యాన్యువల్ ఎగ్జామ్స్ మొదలవుతాయనగా ఇపుడు ఈ స్కూల్లోని విద్యార్ధులను ఇతర స్కూళ్ళల్లో సర్దుబాటు చేయటం కష్టమే. ఒకవేళ సర్దుబాటు చేసినా కొత్త స్కూళ్ళల్లో టీచింగుకు అలవాటపడటం విద్యార్ధులకు ఇబ్బందులనే చెప్పాలి. ఇందుకనే విద్యార్ధుల తల్లి, దండ్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్కూలు గుర్తింపును రద్దుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తల్లి, దండ్రులు తప్పుపడుతున్నారు.

స్కూలు గుర్తింపును రద్దుచేసేబదులు ఈ విద్యాసంవత్సరం ముగిసేవరకు ఎవరినైనా ఉన్నతాధికారిని ఇన్చార్జిగా నియమించాలని అడుగుతున్నారు. విద్యార్ధులు కట్టిన ఫీజును ప్రభుత్వం తిరిగిచ్చేయాలని చెప్పినా యాజమాన్యం ఇచ్చే అవకాశంలేదని తల్లి, దండ్రులు మొత్తుకుంటున్నారు. కాబట్టి స్కూలు గుర్తింపురద్దని కాకుండా ఇంకేదైనా మార్గం చూడాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ముందు ఈ విద్యాసంవత్సరం గడచిపోతే తర్వాత నిర్ణయం తర్వాత తీసుకోవచ్చని తల్లి, దండ్రులు ప్రభుత్వానికి పదేపదే చెబుతున్నారు. మరి చివరకు ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.
Tags:    

Similar News