సీనియర్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని ఉండవల్లి చేసిన విమర్శలు ఆ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి తప్పుపట్టారు. ఎంతో అనుభవం ఉన్న ఉండవల్లి ఇలా మాట్లాడడం విచిత్రంగా ఉందని అన్నారు. ఉండవల్లి అధికార పార్టీకి రక్షణగా నిలబడ్డారా, ఇన్నాళ్లు తప్పుగా కనిపించిన చంద్రబాబు ప్రవర్తన ఇపుడు ఉండవల్లికి నచ్చిందా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా ప్రారంభించిన రెయిన్ గన్స్ ద్వారా 24 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని ఆర్భాటం చేశారని, చివరకు ఒక్క ఎకరాలో కూడా పంట రాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఖరీఫ్ లో రైతులు దెబ్బతిన్నారని ప్రస్తావించారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని, రుణ మాఫీ చేయాలని - రైతులకు కొత్త రుణాలు లభించేలా చూడాలని, వడ్డీ మాఫీ చేయాలని - పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ - ఇన్సూరెన్స్‌కు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారం చేపట్టిన ఈ రెండున్నర ఏళ్ళలో రైతులు చాలా కష్టాలు పడ్డారని ఆవేదన చెందారు. జూన్ లో కురిసిన వర్షాలతో రైతులు లక్షలాది ఎకరాల్లో వేరు శనగ పంట వేసినా - పంట చేతికి రాలేదని అన్నారు. రుణాలు తీసుకుని వ్యవసాయం చేసిన రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయిందని ఆయన తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/