అన్నాదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందెవరు?

Update: 2020-01-17 07:35 GMT
తెలంగాణలో ఒకప్పుడు రాజకీయాలను ఏలిన నేత కాకా.. పెద్దపల్లి ఎంపీగా కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ అధిష్టానంలో కీలకమైన పెద్ద పదువులు  జి. వెంకటస్వామి అనుభవించారు. జి. వెంకటస్వామి చనిపోయే వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగారు. తండ్రి బాటలోనే ఆయన కుమారులు జి. వినోద్ - వివేక్ లు నడిచారు. కానీ తండ్రి మరణం తర్వాత పరిస్థితి వేరైంది.

రాజకీయ లబ్ది - సీట్లు దక్కక ఒకే మాట.. ఒకే బాటగా నడిచిన అన్నాదమ్ములు వేరయ్యారు. ప్రస్తుతం చెరోపార్టీలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ ను వీడి గులాబీ పార్టీలో చేరారు గడ్డం సోదరులు. అయితే  పెద్దపల్లి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జి. వివేక్ టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఇక బెల్లంపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వనందుకు అలిగి టీఆర్ ఎస్ ను వీడి బీఎస్పీ తరుఫున పోటీచేశారు వినోద్. అయితే తమ్ముడి బాటలో బీజేపీలో వినోద్ చేరుతాడని అంతా అనుకున్నా అలా కాలేదు. వివేక్ కు షాకిస్తూ వినోద్ మళ్లీ ఢిల్లీ వెళ్లి సొంతూ గూడు కాంగ్రెస్ లో చేరారు.

దీంతో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న కాకా వారసులు విడిపోయారు. వారి మధ్య విభేదాలు బయటపడ్డాయన్న చర్చ మొదలైంది. ఇప్పుడు వీరి అభిమానులు - వారసులు ఏ పార్టీలో ఉండాలో తెలియక తికమకపడుతున్నారు. కార్యకర్తలు సైతం అన్నాదమ్ముల వైపు చీలిపోయారట..

మున్సిపల్ ఎన్నికల వేళ వివేక్ - వినోద్ లు బీజేపీ - కాంగ్రెస్ తరుఫున ప్రచారం మొదలుపెట్టడంతో వీరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఒకే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అన్నాదమ్ముల ఫైట్ ఆసక్తి రేపుతోంది.


Tags:    

Similar News