రాజకీయాల్లో విలువలు పాటించటం.. మర్యాదగా వ్యవహరించటం పోయి చాలా కాలమే అయ్యింది. ప్రత్యర్థి రాజకీయ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. అవసరమైతే ఎంత మాట పడితే అంత మాట అనేందుకు సైతం వెనుకాడకపోవటం దూకుడు రాజకీయాల్లో ఎక్కువైంది. ఏదైనా అంశంపై తమకు కించిత్ డ్యామేజ్ జరుగుతుందని ఫీలైనా సరే.. మాటల్లో తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది.
గడిచిన కొద్దిరోజులుగా గ్యాంగ్ స్టర్ నయిం వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నయింకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెర మీదకు రావటం.. అతగాడి నేరచరితలో పోలీసులు.. రాజకీయ నాయకుల పాత్ర ఉందన్న విమర్శలు.. ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా నయింకు తెలంగాణ అధికారపక్ష నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్న వేళ.. తెలంగాణ అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ మాటల తీవ్రత ఎంతవరకూ వెళ్లిందంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బట్టలూడదీసి ప్రజలు కొడతారంటూ అనేసేంతగా. నయింను కాంగ్రెస్.. తెలుగు దేశం పార్టీలో పెంచి పోషించాయని.. ఈ అంశంపై తాము చర్చకు ఎక్కడైనా సిద్ధమంటూ టీఆర్ ఎస్ నేతలు గాదరి కిషోర్.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. అహంకార ధోరణితో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఒప్పుకునేది లేదన్న నేతలు.. తాము ప్రజా ఉద్యమంలో భాగంగానే ప్రజాప్రతినిధులు అయ్యామన్నారు.
నయిం కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ నాటి ముఖ్యమంత్రులు రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డిలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా వారు ఏమీ పట్టించుకోలేదని.. అందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు మాత్రం నయిం అనే మానవమృగాన్ని అంతమొందించిందన్నారు. నయింను విపక్షాలు పెంచి పోషిస్తే.. తాము అంతం చేశామన్నారు. ఏది ఏమైనా గౌరవనీయ స్థానాల్లో ఉన్న నేతలు విమర్శలు చేసినా.. విరుచుకుపడినా కనీస మర్యాదల్ని పాటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.