గ‌ద్ద‌ర్ ఆధ్వ‌ర్యంలో కొత్త పార్టీ...

Update: 2017-02-02 11:42 GMT
ప్రజాయుద్ద నౌక గద్దర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 6న కొత్త పార్టీ ఆవిర్భవించనుందని స‌మాచారం పార్టీకి "త్యాగాల తెలంగాణ" అని పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటుకు ముందుగా చేయాల్సిన క్షేత్ర‌స్థాయి కార్య‌క్ర‌మాల్లో భాగంగా జిల్లాల వారిగా క‌లిసివ‌చ్చే వారితో చ‌ర్చ‌లు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేర‌కు గ‌ద్ద‌ర్ రంగంలోకి దిగిన‌ట్లు చెప్తున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కాన్ని కొద్దికాలం క్రితం గ‌ద్ద‌ర్ ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం ద్వారా పల్లెసీమ‌ల్లోని కుల‌వృత్తుల వారు వ‌ల‌స‌లు వెళ్లే ప‌ని ఉండ‌ద‌ని గ‌ద్ద‌ర్ ప్ర‌శంసించారు. అంతేకాకుండా నాస్తిక‌వాదిగా పేరున్న గ‌ద్ద‌ర్ దేవాల‌యంలోకి వెళ్లి పూజ‌లు చేశారు. ఈ ప‌రిణామం ఒకింత ఆశ్చ‌ర్యక‌రంగా నిలిచింది. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వంపై ఉమ్మ‌డి పోరాటాలు చేయ‌డానికి నిర్ణ‌యించుకున్న కాంగ్రెస్ ఈ క్ర‌మంలో ప్ర‌జాస్వామిక వాదుల‌ను క‌లుపుకోవాల‌ని భావించి గ‌ద్ద‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రిపింది. పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు - డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క స్వ‌యంగా గ‌ద్ద‌ర్ నివాసానికి వెళ్లి ఆయ‌న‌తో ముచ్చ‌టించారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో త‌మ‌తో వేదిక పంచుకోవాల‌ని కోరగా...దీనికి గ‌ద్ద‌ర్ నిరాక‌రించిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఇందుకు బ‌లం చేకూరుస్తున్న‌ట్లుగా గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా గ‌ద్ద‌ర్ పార్టీ పెడుతున్నట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News