మాజీ విప్లవనేత, ప్రజాగాయకుడు గద్దర్ తన పోరాట పంథా మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. సహజంగా వామపక్ష భావజాలం ఉన్నవారు, అందులోనూ నక్సలైట్లుగా పనిచేసిన వారు దేవుడిని విశ్వసించారు. కానీ గద్దర్ ఇటీవల ఓ దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు. ఇపుడు అదే రీతిలో ఆయన పల్లె పల్లెకో గుడి ఉండాలని సూచించారు.
తెలంగాణ పల్లె ప్రాంతాల్లో పరిస్థితిని చూసేందుకు ‘తెలంగాణ దర్శనం’ పేరుతో పర్యటిస్తున్న గద్దర్ ఈ క్రమంలో మెదక్ జిల్లా శివ్వంపేటకు చేరారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలేఖరులతో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలోని ప్రతి పల్లెలో బడి - గుడి - ప్రభుత్వ వైద్యశాల ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలా పల్లెసీమల అభివృద్ధి సాధ్యమైనప్పుడే తెలంగాణ సాధించినదానికి అర్థం ఉంటుందని గద్దర్ అన్నారు.
త్యాగాల తెలంగాణతోనే అమరవీరులకు గుర్తింపు లభిస్తుందని గద్దర్ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కాకుండా త్యాగాల తెలంగాణతో పల్లెలను అభివృద్ధి పర్చాలన్ని ఆలోచనా విధానం రావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు - బలహీన వర్గాల సంక్షేమం కోసం సమాన న్యాయం అవసరమన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలని గద్దర్ కోరారు. పంచాయితీల్లో పనిచేస్తున్న సఫాయి కార్మికుల కనీస వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి కోరానని గద్దర్ చెప్పారు. గ్రామాల్లో చదువుతున్న పేద కుటుంబాలకు చెందినవారికి కేజి టూ పీజి విద్య ఉచితంగా ఇచ్చే పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సఫాయి కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో గద్దర్ పాల్గొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/