వామపక్ష భావజాలం ఉన్న వారికి దేవుడు.. దెయ్యాలు లాంటివి దాదాపుగా ఉండవు. కొంతమంది మాత్రం ఎవరి నమ్మకాలు వారివి.. వాటికి అభ్యంతరాలు చెప్పటానికి మనమెవరం? అంటూ ప్రశ్నిస్తుంటారు. ఎక్కువమంది తీరు మాత్రం దేవుడికి దూరంగానే ఉండటం కనిపిస్తుంది. ప్రజాకవిగా.. వామపక్ష వాదిగా సుపరిచితుడైన గద్దర్ గడిచిన కొద్దికాలంగా బయట కనిపించటం లేదనే చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా గుడికి వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. గుడికి వెళ్లటమే కాదు.. భగవన్మామస్మరణ చేయటం.. వేద పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పటం.. మల్లన్నస్వామి వారిని కీర్తిస్తూ పాడటం లాంటివి చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తమ ఆకాంక్ష తీరాలని కొమెరవెల్లి మల్లికార్జున స్వామికి తాను ముడుపు కట్టానని చెప్పారు. మల్లన్న బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకని భార్య విమల.. కోడలు సరితతో కలిసి గుడికి వచ్చిన ఆయన.. లక్ష బిల్వార్చన పూజలో పాల్గొన్నారు.
బాల్యంలో మల్లన్నను చూడటానికి తల్లితో కలిసి వచ్చానన్న పాత ముచ్చట్లను గుర్తు చేసుకున్న గద్దర్.. అప్పట్లో మల్లన్న సొరికెలో ఉంటాడని.. దర్శించుకోవటానికి కుదరదని చెప్పటంతో బయట నుంచే మొక్కి వెళ్లిపోయామన్నారు. అప్పటి దర్శనం ఇప్పటికి అయ్యిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. గుడిలోదేవుడికి ప్రత్యేక పూజలు.. దర్శనం తర్వాత ‘‘పొడుస్తునన పొద్దు మీద..’’ పాటతో పాటు.. ‘‘శివాయ నమ:’’ అంటూ స్వామి వారి మీద పాటను పాడేశారు. ఉద్యమ గీతాల్ని పాడేసే ఈ వామపక్ష వాదిలో ఇంత పెద్ద ఆస్తికుడు ఉన్నాడా? అన్న ఆశ్చర్యం పలువురికి కలిగించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/