ప్రజా యుద్ధనౌక గద్దర్ తన రాజకీయ విధానాలపై, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై దాదాపుగా క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ తో కలిసి పనిచేయడంపై ఆయన సానుకూలత కనబరిచారు. పవన్ తనకు చిరకాల మిత్రుడంటూ ఆయన చెప్పడం రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ పేరు బాగా వినిపిస్తోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడని గద్దర్ అన్నారు. తన సొంత పార్టీ గురించి తొలుత ఆలోచిస్తానని చెబుతూనే పవన్ తో కలసి పనిచేసే అంశం గురించి ఆలోచిస్తానని కూడా చెప్పారు. రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదని... ఎప్పుడూ తుపాకీ పట్టుకునే ఉండాలా అని గద్దర్ ప్రశ్నించారు. రాజ్యాధికారం అన్నింటికన్నా ముఖ్యమని... ఓటు ఎన్నటికీ ఆయుధమే అని చెప్పారు.
ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను తరలించాలని టీఆర్ ఎస్ ప్రభుత్వం యత్నిస్తుండటం సరైనది కాదని... ప్రభుత్వం ఇలాగే ముందుకు సాగితే ప్రతి ఇంటిని ఒక ధర్నా చౌక్ చేయాలని పిలుపునిచ్చారు. కాగా కొద్ది రోజుల కిందట ఆయన మావోయిస్టు పార్టీతో ఉన్న తన సుదీర్ధ అనుబంధాన్ని వదులుకున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. రాజకీయ పార్టీ పెడతాననీ ప్రకటించారు. దీంతో ఆయన, పవన్ కలిసి పనిచేస్తారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. దానికి ఇప్పుడు గద్దర్ వైపునుంచి క్లారిటీ వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/